హింసాత్మకంగా మారిన ర్యాలీ, బీజేపీ నేతల అరెస్ట్, గాయాలు
కోల్ కతాలో బీజేపీ నేతలు నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. సచివాలయం ముట్టడించేందుకు బయల్దేరారు. టీఎంసీ ప్రభుత్వ అవినీతి గురించి ర్యాలీ నిర్వహించారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.. కొందరినీ కొట్టారు. దీంతో స్వల్పంగా గాయపడ్డారు.
సచివాలయం ముట్టడించేందుకు బయల్దేరగా.. బీజేపీ నేతలు సువేందు అదికారి, రాహుల్ సిన్హా ఇతరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్నిమిత్ర పౌల్‌ను హౌరా మైదానం వద్ద అరెస్ట్ చేశారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వాటర్ క్యానన్స్ కూడా యూజ్ చేశారు. సచివాలయం బ్యారికేడ్ల మీదుగా దూసుకొచ్చేందుకు యత్నించిన వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.
అయితే కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాల్లు రువ్వారు. హౌరా.. ఆ పరిసర ప్రాంతాల్లో కొంత ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. కోల్ కతాలో గల లాల్ బజార్, ఎంజీ రోడ్‌లో పరిస్థితి బాగోలేదు. పోలీసు వాహనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మరో పోలీసు కారుకు కూడా నిప్పు పెట్టారు.












Click it and Unblock the Notifications