వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పైస్‌ జెట్‌ బంపర్ ఆఫర్: రూ.12కే విమాన టిక్కెట్, అంతేనా? ఇంకా...

స్పైస్‌ జెట్‌ విమాన ప్రయాణికుల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 12వ వార్షికోత్సవం సందర్భంగా రూ.12 ప్రారంభ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది. అంతేకాదు, ‘బారా సాల్‌, బడా ధమాల్‌’ పేరుతో లక్కీ డ్రాలో

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: బడ్జెట్‌ క్యారియర్‌ ఎయిర్‌లైన్‌ స్పైస్‌ జెట్‌ విమాన ప్రయాణికుల కోసం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అన్ని మార్గాల్లో అతి తక్కువ, డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. రూ.12 ప్రారంభ ధరకే విమాన టికెట్లను అందిస్తోంది.

12వ వార్షికోత్సవం సందర్భంగా స్పైస్‌ జెట్‌ ఈ అద్భుతమైన ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదనపు ఛార్జీలు, ఇతర పన్నులను మినహాయించి ఈ ధరలను అందిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

SpiceJet announces 12th anniversary sale, offers tickets starting Rs 12 on all routes

12 వ వార్షికోత్సవ అమ్మకాలుగా చెబుతున్న ఈ ఆఫర్‌లో మే 23 నుంచి 28 వరకు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ బుకింగ్స్‌ ద్వారా జూన్ 26, 2017నుంచి మార్చి 24, 2018 వరకు ప్రయాణించవచ్చు. అయితే నాన్‌ స్టాప్‌ విమానాల్లో మాత్రమే ఈ ఆఫర్‌ లభ్యం కానుంది.

అంతేకాదు మరో అద్భుతమైన ఆఫర్‌ను కూడా స్పైస్‌ జెట్‌ తన ప్రయాణికులకు అందిస్తోంది. 'బారా సాల్‌, బడా ధమాల్‌' పేరుతో లక్కీ డ్రా నిర్వహిస్తోంది. ఈ ఆఫర్‌ లో బుక్‌ చేసుకున్న టికెట్లపై ఉచిత విమాన టికెట్లు, ఇతర బహుమతులను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌ లో పేర్కొంది.

స్పైస్‌ మ్యాక్స్‌, భోజనం, సీట్ల ఎంపిక, ఇతర అనుబంధాలపై 20 శాతం తగ్గింపు లాంటి అదనపు ప్రయోజనాలు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో టికెట్లు బుక్ చేసుకుంటే ఫ్రీ మీల్స్‌, ఫ్రీ ప్రయారిటీ చెక్‌ ఇన్‌కు కూడా అర్హత పొందవచ‍్చని తెలిపింది.

English summary
Budget carrier SpiceJet is offering tickets at as low as Rs 12 on the occasion of its 12th anniversary. Called the 12th anniversary sale, you can book tickets from May 23 to May 28, 2017. The travel period under the sale starts from 26 June 2017 to 24 March 2018. The discount is applicable only for non-stop flights on all routes. The Rs 12 ticket price includes base fare excluding surcharge and taxes. The airline is also organising '12 saal, bada dhamaal ' lucky draw being one. Book a ticket during the sale period and stand a chance to win free tickets and other prizes, the airline's website says.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X