వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పైస్‌జెట్: భారత ఎయిర్‌లైన్‌పై ర్యాన్‌సమ్‌వేర్ అటాక్.. నిలిచిపోయిన విమాన సేవలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
స్పైస్‌జెట్

తమ సిస్టమ్స్‌పై ర్యాన్‌సమ్‌వేర్ అటాక్ జరిగిందని భారత్‌కు చెందిన స్పైస్‌జెట్ వెల్లడించింది. ఈ సైబర్‌దాడి వల్ల చాలా విమానాల రాకపోకలు ఆలస్యం అయ్యాయి. ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఎక్కువసేపు ఎదురుచూడాల్సి వచ్చింది.

తమ విమానాలు ఆలస్యమయ్యాయంటూ బుధవారం చాలా మంది స్పైస్‌జెట్ టికెట్లు బుక్‌చేసుకున్న ప్రయాణికులు ఆన్‌లైన్‌లో ట్వీట్లు చేశారు.

బోర్డింగ్ కోసం గంటల నుంచీ ఎదురుచూస్తున్నామని చాలా మంది ఫోటోలు ట్వీట్ చేశారు. అయితే, వీటిపై మొదట స్పైస్‌జెట్ స్పందించలేదు.

https://twitter.com/flyspicejet/status/1529296241305460736?

ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణిగాయని స్పైస్‌జెట్ ఆ తర్వాత ఒక ప్రకటన విడుదల చేసింది.

''మా ఐటీ బృందం ఆ ర్యాన్‌సమ్‌వేర్ దాడిని పసిగట్టింది. పరిస్థితులు ఇప్పుడు సాధారణానికి వచ్చేశాయి. విమాన రాకపోకలను కూడా పునరుద్ధరించాం’’అని సంస్థ ఒక ట్వీట్ చేసింది.

ఆ తర్వాత కూడా..

స్పైస్‌జెట్ ట్వీట్ తర్వాత కూడా చాలా మంది ప్రయాణికులు తాము వేర్వేరు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయామని సోషల్ మీడియాలో వెల్లడించారు.

తమకు కనీసం ఆహారం లేదా నీరు కూడా ఇవ్వలేదని, అసలు ఏం జరిగిందో తమకు చెప్పలేదని వారు చెప్పారు.

ధర్మశాలకు వెళ్లాల్సిన తన విమానం మూడు గంటలకుపైగా ఆలస్యం అయ్యిందని ప్రయాణికుడు ముదిత్ షేజ్వార్ ట్వీట్ చేశారు.

https://twitter.com/RKSah_India/status/1529310480409325570?s

''మేం విమానం ఎక్కి ఇప్పటికే 80 నిమిషాలు గడిచింది. కానీ, అసలు విమానం బయల్దేరలేదు. సర్వర్ డౌన్ అయ్యిందని మాకు చెప్పారు. అసలు ఇది నిజమేనా?’’అని ఆయన ట్వీట్ చేశారు.

అసలు విమానం ఎక్కడుందో చెప్పాలని అడిగినప్పుడు, గేట్ దగ్గర నుంచి సిబ్బంది వెళ్లిపోయారని మరికొందరు ట్వీట్ చేశారు.

ఇంకా ఆపరేషన్లు మొదలుకాలేదని, అసలు ఏం జరిగిందో స్పైస్‌జెట్ సిబ్బందికి కూడా తెలియదని మరికొందరు ఫిర్యాదు చేశారు.

https://twitter.com/himannshum/status/1529322879749341184?s

''మాతోపాటు పిల్లలు, వృద్ధులు ఉన్నారు. వారికి కనీసం ఆహారం లేదా నీరు కూడా ఇవ్వలేదు. గేట్ల దగ్గర ఎవరూ లేరు’’అని ఒక ప్రయాణికుడు ట్వీట్ చేశారు. కస్టమర్ సర్వీస్ నంబర్లు కూడా నాట్‌రీచబుల్ అని వస్తున్నాయని మరికొందరు చెప్పారు.

పశ్చిమ బెంగాల్‌లో ఒక వ్యక్తి తన భార్య ఫోటోను ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో ఆమె కాలికి గాయమైనట్లు కనిపిస్తోంది. విమానం కోసం గంటల నుంచి ఎదురుచూస్తున్నామని ఆయన ట్వీట్ చేశారు.

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు రుసుము చెల్లించకపోవడంతో కొన్ని స్పైస్‌జెట్ విమానాలకు గత వారం అనుమతులు ఇవ్వలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. తమ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య వల్ల తాము చెల్లింపులు చేయలేకపోయాని ఎయిర్‌లైన్ కూడా పేర్కొంది.

భారత్‌లోని విమానాశ్రయాలు ఏఏఐ ఆధీనంలో ఉంటాయి. చెల్లింపుల అనంతరం స్పైస్‌జెట్‌ విమానాల రాకపోకలకు ఏఏఐ అనుమతి ఇస్తోంది. ఇదివరకు సంస్థకు క్రెడిట్ సదుపాయం ఉండేది. కానీ, చెల్లింపులు సరిగా చేయకపోవడంతో ఆ సదుపాయాన్ని ఏఏఐ ఉపసంహరించుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Spice jet services halted after ransomeware attack
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X