గాలిలో విమానం, ఎమర్జెన్సీ డోరు తెరిచే ప్రయత్నం -ఢిల్లీ-వారణాసి స్పైస్ జెట్ ఫ్లైట్‌లో ప్రయాణికుడి దుశ్చర్య
వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా ఓ ప్రయాణికుడు చేసిన దుశ్చర్య కలకలం రేపింది. విమానం గాలిలో ఉండగా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించిన ఆ దుండగుణ్ని సిబ్బంది, తోటిప్రయాణికులు బంధించారు. విమానం సురక్షితంగా క్రిందికి దిగే అతణ్ని నిరోధించారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లిన స్పైస్ జెట్ విమానంలో శనివారం ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ లోని ఫూల్‌పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ నుంచి వారణాసి వెళ్ళే విమానంలో శనివారం ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను నిరోధించి, అదుపులోకి తీసుకున్నారు.

వారణాసిలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు ఆ వ్యక్తిని అదుపులో ఉంచారు. ఈ ప్రయత్నంలో విమాన సిబ్బందికి ఇతర ప్రయాణికులు కూడా సాయపడ్డారు. కాగా, దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తి మానసిక స్థితి సక్రమంగా లేదని తెలుస్తోంది. విమానం పైలట్ ఈ విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలిపారు. తన విమానం క్రిందికి దిగేందుకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఆ ప్రయాణికుడిని కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్)కు అప్పగించారు.
ఈ ఘటనపై స్పైస్ జెట్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ''2021 మార్చి 27 న, ఢిల్లీ నుంచి వారణాసి వెళుతోన్న స్పైస్ జెట్ విమానం (ఎస్ జీ 2003) లో ఒక ప్రయాణికుడు.. విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో లోపల మొత్తం 83 మంది ప్రయాణికులున్నారు. ఇతర ప్రయాణికులతో కలిసి మా సిబ్బంది ఆ వ్యక్తిని నిలువరించడంతో విమారం వారణాసిలో సురక్షితంగా దిగింది'' అని స్సైజ్ జెట్ పేర్కొంది.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications