దెబ్బ మీద దెబ్బ: అళగిరిని కలిసిన స్టాలిన్, డీఎంకేలో మార్పులు?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) ట్రెజరర్ ఎంకే స్టాలిన్ బుధవారం నాడు తన సోదరుడు, తనకు కంటిలో నలుసుగా మారిన ఎంకే అళగిరిని కలిశారు. ఈ నేపథ్యంలో త్వరలో పార్టీలో మార్పులు, చేర్పులకు అవకాశముందని భావిస్తున్నారు.

అళగిరి అప్పుడప్పుడు తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి ఇంటికి వస్తున్నారు. ఈ సమయంలో వారి మధ్య భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, తాను అస్వస్థతతో ఉన్న తన తండ్రి కరుణానిధిని కలుస్తున్నట్లు అళగిరి చెబుతున్నారు.

Stalin meets Azhagiri, Changes imminent in DMK?

పార్టీలో ఆధిపత్య పోరు నేపథ్యంలో కరుణానిధి.. అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. స్టాలిన్ కోసం ఆయన ఈ పని చేశారు. దీంతో ఆ తర్వాత జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అళగిరికి పట్టు ఉన్న ప్రాంతాల్లో డీఎంకే బాగా దెబ్బతిన్నది. అంతేకాదు, ఇటీవల ఉప ఎన్నికల్లోను డిఎంకె దెబ్బతిన్నది.

అళగిరికి మధురై బెల్టులో మంచి పట్టు ఉంది. ఇక్కడ దెబ్బతిన్నడి. తిరుపరంకుంద్రం ఉప ఎన్నికల్లో 18వేల పై చిలుకు మెజార్టీతో ఓడిపోయింది. వరుస ఓటముల నేపథ్యంలో.. అళగిరితో దోస్తీకి స్టాలిన్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అళగిరి తిరిగి పార్టీలోకి వస్తే పార్టీలో చేర్పులు, మార్పులు ఉంటాయని భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Dravida Munnetra Kazhagam's Treasurer M K Stalin met brother turned political rival, M K Azhagiri recently sparking off rumours of imminent changes in the party according to sources.
Please Wait while comments are loading...