పన్నీర్ సెల్వంను ఇరకాటంలో పెట్టిన పళనిసామి, అలా చేస్తే జయలలితకు వ్యతిరేకంగా ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ఇరకాటంలో పెట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే అది అమ్మ జయలలితకు వ్యతిరేకంగా ఆందోళన చేసినట్లే అంటూ పన్నీర్ సెల్వంను ఇబ్బంది పెట్టారు.

తమిళనాడు ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, అభివృద్ది పథకాలు నత్తనడకన సాగుతున్నాయని, పేద ప్రజల కోసం అమ్మ జయలలిత ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తు పన్నీర్ సెల్వం ఈనెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చెయ్యాలని పిలుపునిచ్చారు.

Tamil Nadu minister Jayakumar hints unity

అయితే మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాలని నిర్ణయించిన ధర్నాలను పన్నీర్ సెల్వం వాయిదా వేసుకున్నారు. ఈ సందర్బంలోనే తమిళనాడు మంత్రి జయకుమార్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి అమ్మ జయలలిత కారణం అని చెప్పారు.

తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం ఆందోళన చేస్తే అది అమ్మ జయలలితకు వ్యతిరేకంగా చేసిన ఆందోళన చేసినట్లు అవుతోందని ఇరకాటంలో పెట్టారు. అమ్మ జయలలిత మీద అభిమానం ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చెయ్యరాదని పరోక్షంగా పన్నీర్ సెల్వంకు సూచించి ఆయన్ను ఇరకాటంలో పెట్టారు. అందరు కలిసి ఉంటే మనకే మంచిదని, విలీనం చర్చలకు ముందుకు రావాలని పన్నీర్ సెల్వంకు సూచించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minister Jayakumar indirectly advises o. Paneerselvam that protesting against AIADMK government is equal to protest against Jayalalitha.
Please Wait while comments are loading...