విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్?
త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు, ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. దీనికి ఆల్ ఇండియా పురచ్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం (AIPTMMK) పేరును ఖరారు చేశారు. ఈ పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. కొబ్బరి చెట్ల పొలాన్ని పార్టీ అధికారిక చిహ్నంగా ఆవిష్కరించారు. నలుపు, తెలుపు, ఎరుపు రంగులతో పాటు అన్నాదురై, ఎమ్జీఆర్, జయలలిత ఫొటోలను ముద్రించివున్న పతాకాన్ని విడుదల చేశారు.

దీంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. టీవీకేతో సంప్రదింపులు ముమ్మరం చేసింది. బీజేపీ- టీవీకే చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీవీకేకు ముందు పలు ప్రతిపాదనలు ఉంచిందనే ప్రచారం జరుగుతోంది. భారీ ఆఫర్లను అందించడానికి సైతం బీజేపీ అధిష్ఠానం అంగీకరించినట్లు చెబుతున్నారు.
ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- బీజేపీ కూటమి గెలిస్తే విజయ్‌కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినట్లు సమాచారం. దీంతో పాటు- టీవీకేకు సుమారు 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై టీవీకే ఇప్పటికిప్పుడు ఎటువంటి నిర్ణయాలను తీసుకోలేదని అంటున్నారు.
ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే తమిళనాడులో రాజకీయ, ఎన్నికల సమీకరణాలను గణనీయంగా మారిపోతాయనే అబిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవికి బదులుగా విజయ్ ముఖ్యమంత్రి హోదాను ఆశిస్తోన్నారని, అదే ఈ చర్చల్లో కీలక అంశంగా కొనసాగుతోందనే వాదనలు లేకపోలేదు.
విజయ్, ఆయన పార్టీని ఎన్డీఏ గొడుగు కిందకు తీసుకురావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. క్రియాశీల రాజకీయాల్లోకి విజయ్ ప్రవేశించినప్పటి నుంచీ ఆయనపై ఓ కన్ను వేసి ఉంచింది. విజయ్ కు కోట్లాదిమంది అబిమానులు ఉండటం వల్ల టీవీకే చాలా తక్కువకాలంలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లిందని, దాన్ని ఓటుబ్యాంకుగా మలచుకోవాలనేది బీజేపీ ప్రయత్నం.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
విజయ్ పై కక్షసాధింపు? -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
'పెద్ది' స్థానంలో విజయ్ 'జన నాయగన్'.. ఇదేం ట్విస్ట్ సామీ..! -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా?












Click it and Unblock the Notifications