వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి సన్నిహితుడు ఆనంద్ సింగ్ జైలు నుంచే రాజీనామా (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బళ్లారి జిల్లా విజయనగర శాసన సభ నియోజక వర్గం ఎంఎల్ఏ, మాజీ మంత్రి, గాలిజనార్ధన్ రెడ్డికి సన్నిహితుడు ఆనంద్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గత గురువారం లోకాయుక్త ప్రత్యేక పోలీసు బృందం ఆనంద్ సింగ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించింది

బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆనంద్ సింగ్ జైళ్ల శాఖ ఏడీజీపీ ద్వారా కర్ణాటక విదాన సభ స్పీకర్ కాగోడు తిమ్మప్పకు సోమవారం తన రాజీనామా లేఖను పంపించారు. తనకు సమాజ సేవ చెయ్యడానికి అవకాశం లేకుండా పోతున్నదని, అందుకే రాజీనామా చేస్తున్నానని వివరించారు.

బెళేకేరి హార్బర్ నుండి ఇనుప ఖనిజం అక్రంగా తరలించారని ఆరోపిస్తూ 2013లో సీబీఐ అధికారులు ఆనంద్ సింగ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. 2015 జనవరిలో సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ రావడంతో ఆనంద్ సింగ్ విడుదల అయ్యారు.

శాసన సభ్యుడు నిత్యం ప్రజల మధ్య ఉంటే సమాజ సేవ చెయ్యడానికి అవకాశం ఉంటుంది. అయితే తాను తన నియోజక వర్గ ప్రజలకు దూరం అయ్యానని, జైలులో ఉండి సేవ చెయ్యలేనని అందుకే రాజీ నామా చేస్తున్నానని స్పీకర్ కు పంపింన లేఖలో ఆనంద్ సింగ్ ఈ వివరాలు పోందుపరిచారు.

జైలు నుండి మళ్లీ జైలుకు

జైలు నుండి మళ్లీ జైలుకు

ఇనుప ఖనిజం అక్రమంగా రవాణా చేశారని సీబీఐ అధికారులు ఆనంద్ సింగ్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుండి విడుదల అయిన ఆనంద్ సింగ్ ను మళ్లీ లోకాయుక్త అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

ఇనుప ఖనిజం అక్రమ రవాణా

ఇనుప ఖనిజం అక్రమ రవాణా

బెళేకేరి హార్బర్ నుండి ఇనుప ఖనిజం అక్రమంగా రాత్రికి రాత్రే విదేశాలకు తరలించారని ఆనంద్ సింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు.

విదేశాల నుండి వస్తుంటే..

విదేశాల నుండి వస్తుంటే..

బెళేకేరి నుండి అక్రమంగా ఇనుప ఖనిజం రవాణా చేస్తున్నారని సీబీఐ అధికారులు ఆనంద్ సింగ్ మీద 2013లో కేసు నమోదు చేశారు. ఆ సమయంలో ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. విదేశాల నుండి వస్తున్న సమయంలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీబీఐ అధికారులు ఆనంద్ సింగ్ ను అరెస్టు చేశారు.

బీజేపీకి గుడ్ బై చెప్పారు, అయినా

బీజేపీకి గుడ్ బై చెప్పారు, అయినా

జగదీష్ శెట్టర్ కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసే సమయంలో ఆనంద్ సింగ్ పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2013లో బీజేపీకి గుడ్ బై చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా పోటి చెయ్యాలని నిర్ణయించారు. అయితే బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుని బీజేపీ టిక్కెట్ ఇవ్వడంతో మళ్లీ గెలుపోందారు.

చైనా సింగపూర్ కు

చైనా సింగపూర్ కు

ఆనంద్ సింగ్ వైష్ణవి మినరల్స్ పేరుతో బెళేకేరి హార్బర్ నుండి అక్రమంగా సింగపూర్, చైనాకు ఇనుప ఖనిజం తరలించారని ఆరోపణలు ఎదుర్కుంటున్నారు 2009 నుండి 2010 మద్యలో అక్రమ రవాణా జరిగిందని కేసులు నమోదు అయ్యాయి.

English summary
Vijaynagar (Bellary) MLA Anand Singh has submitted his resignation to his post on 13th April from Parappana Agrahara jail, Bengaluru. The Special Investigation Team (SIT) with the Karnataka Lokayukta had arrested the BJP leader on 9th April on charges of illegally transporting iron ore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X