వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIRAL VIDEO:ఎలుగుబంటి బీభత్సం, ముగ్గురిపై దాడి, వైరల్

|
Google Oneindia TeluguNews

ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. అవును.. ముగ్గురిపై దాడికి తెగబడింది. వారిలో ఒకరిద్దరీ పరిస్థితి క్రిటికల్‌గా ఉందట.. తమిళనాడులో గల టెంకాశి జిల్లాలో ఘటన జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. వీడియో 21 సెకన్లు ఉండగా.. అందులో సదరు వ్యక్తిపై అదీ దాడి చేస్తోన్న ఫుటేజీ భయాందోళనకు గురిచేస్తోంది.

కరుథిలింగపురం గ్రామానికి చెందిన వైగుండమణి మసాలా పొట్లాలు తీసుకుని బైక్‌పై వస్తున్నాడు. అతను శివశైలం నుంచి పెథన్‌పిల్లై వెళ్తుండగా ఘటన జరిగింది. అటవీ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో పక్కనే గల పొదల్లో నుంచి భల్లూకం వచ్చింది. ఒక్కసారిగా అతడిపైకి దూకి దాడిచేసింది.

WATCH: bear attacking three people in Tamil Nadu

అతడిని కింద పడేసిన కొరికింది. ఆ దారిన వెళ్లేవారు, సమీప గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని గట్టిగా అరిచారు. ఎలుగుబంటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అది వైగుండమణిని వదలకుండా దాడి చేస్తూనే ఉంది. ఆ తర్వాత దానిపైకి రాళ్లు విసరడంతో మణిని వదిలిపెట్టింది. కానీ మరో ఇద్దరిపై దాడిచేసి పరారైంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు బాధితులను ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆ ఎలుగుబంటిని బంధించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ ఎలుగుబంటి మాత్రం కాసేపు బీభత్సం చేసింది. ఓ వ్యక్తిపై దాడికి తెగబడింది. పక్కనే ఉన్నవారు అరచి గోల చేసినా పట్టించుకోలేదు. చివరికీ రాళ్లు విసరడంతో అదీ వదిలి పెట్టింది. లేదంటే అతనికి పరిస్థితి మరోలా ఉండేది. అప్పటికే మొహం, పొట్ట భాగంలో గిరేసి రచ్చ రచ్చ చేసింది. అతనికి భూమిపై నూకలు ఉన్నందునే.. బతికి బయటపడ్డాడు. కానీ తీవ్రంగా గాయపడ్డాడు.

English summary
bear attacked three people at the forest area of the Tenkasi district in Tamil Nadu. when Vaigundamani from Karuthilingapuram was on his way from Sivasailam to Pethanpillai carrying masala packets on a two-wheeler.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X