వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్:పన్నీర్ కు డిఎంకె స్నేహహస్తం,శశికళకు చెక్ పెట్టేనా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రికి ఎప్పుడూ వెన్నంటే ఉన్న శశికళ ముఖ్యమంత్రిగా ఎన్నికైతే రాజకీయంగా తమకు ఇబ్బంది అని డిఎంకె భావిస్తోంది . ఈ పరిస్థితుల్లో శశికళ కంటే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉంటే తమకు ఇబ

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:శత్రువుకు శత్రువు మిత్రుడు అంటారు. తమిళనాడు రాజకీయాల్లో ఇదే ఫార్మూలాను అనుసరిస్తున్నాయి రాజకీయపార్టీలు. శశికళ కంటే పన్నీర్ సెల్వంతో అంతగా ప్రమాదం ఉండదనే భావించి పన్నీర్ కు మద్దతిచ్చేందుకు డిఎంకె సానుకూలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తమిళనాడులో శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపడితే తమకు ఇబ్బందికర పరిణామాలు ఎదురౌతాయని డిఎంకె భావిస్తోంది.అయితే పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బందులు ఉండవనే అభిప్రాయాన్ని డిఎంకె నేతలు వ్యక్తం చేస్తున్నారు.

జయలలితకు ఎప్పుడూ వెన్నంటే ఉన్న శశికళ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిస్తే జయ తరహలోనే శశికళ కూడ పాలన నిర్వహించే అవకాశాలు లేకపోలేదని డిఎంకె అంచనా వేసింది.తమకు అన్నాడిఎంకెను పోటీకి నిలపడంలో శశికళ వ్యూహాలను రచించే అవకాశం ఉందని డిఎంకె నాయకులు అభిప్రాయపడ్డారు.

DMK

తమ పార్టీకి గట్టి ప్రత్యర్థులు ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే పన్నీర్ సెల్వం మద్దతివ్వాలనే నిర్ణయానికి వచ్చారనే ప్రచారం ఉంది.

పన్నీర్ సెల్వానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎంఏల్ఏల బలం లేదు.అయితే అన్నాడిఎంకెలో సెల్వానికి మద్దతిచ్చే ఎంఏల్ఏలతో పాటు మిగిలిన తమకు ఉన్న 89 మంది ఎంఏల్ఏల మద్దతిచ్చి సెల్వాన్ని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొపెడితే శశికళ సిఎం కాకుండా అడ్డుకొనే అవకాశం ఉందని డిఎంకె ప్లాన్.

అధికారం లేకపోతే శశికళ వెంట కూడ ఎంఏల్ఏలు ఉండరు.పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా కొంత కాలం కొనసాగిన తర్వా పరిణామాలను పరిశీలించుకొని ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొంటే తదుపరి ఎన్నికల్లో విజయం సాధించేందుకు సానుకూలంగా ఉంటుందని డిఎంకె దూరదృష్టితో ఆలోచనగా ఉంది.

English summary
why DMk support to Panneer selvam.If sasikala sweraing as Tamilnadu Cm Dmk will face problems.Dmk plan to suppport Paneer selvam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X