' కలైంజ్ఞర్ ' అనే పేరు కరుణానిధికి ఎలా వచ్చింది..?

Recommended Video

    Why Karunanidhi is Called 'Kalaignar'? ' కలైంజ్ఞర్ ' అంటే అర్ధం ఏమిటో తెలుసా??

    ద్రవిడ సూరీడు కరుణానిధికి కలైంజ్ఞర్ అనే పేరు ఎలా వచ్చిందో బహుశా ప్రతి తమిళ వ్యక్తికి తెలిసే ఉంటుంది. కానీ తమిళేతరులకు మాత్రం అసలు కలైంజ్ఞర్ అర్థం ఏమిటి.. అది కరుణానిధికి ఎందుకు వచ్చింది అనేది తెలియదు. తమిళ రాజకీయాలు ఫాలో కాని వారికి కూడా తెలియదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని డీఎంకే క్యాడర్ కలైంజ్ఞర్ అని ఎందుకు పిలుస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం...

    తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి ఒక ఉన్నత శిఖరమే కాదు... ఓ గొప్ప రచయిత కూడా. రాజకీయాల్లోకి రాకముందు తలైవా సినిమారంగంలో పనిచేశారు. అక్కడ ఎన్నోసినిమాలకు కథను అందించాడు. తమిళ సాహిత్యానికి కూడా కరుణానిధి యనలేని సేవలందించారు. కరుణ కలం నుంచి ఎన్నో కథలు, నవలలు, నాటకాలు, పద్యాలు జాలువారాయి. ఇవన్నీ ఇప్పుడు కరుణానిధి జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి. తమిళ భాషపై అత్యున్నత పట్టున్న నేతగా కరుణానిధికి మంచి పేరుంది.

    Why is Karunanidhi called Kalaignar?

    ఇక తమిళంలో కలైంజ్ఞర్ అంటే "వివిధ కళలపై పట్టున్న బహుముఖ మేధావి అని అర్థం. ఇది కరుణానిధికే తమిళ ప్రజలు పేటెంట్ హక్కులా ఎందుకు ఇచ్చారంటే.. తమిళ భాషలో ఆయన మేధావి, పదాలతో మాయచేయగల సత్తా ఉన్నవాడు. తమిళ సాహిత్యానికి కరుణానిధి అశేష సేవలందించారు. "కురులోవియం,తోల్కప్పియా పూంగా, పూంబుకర్‌తో పాటు ఎన్నో పద్యాలు, వ్యాసాలు, నవలలు రాశారు. ఇక పుస్తకాల విషయానికొస్తే సంగ తమిళ్, తిరుక్కురల్ ఉరై, పొన్నార్ శంకర్, రొమపూరి పాండియన్, తెన్‌పాండి సింగం, వెలికిలమై, నేన్‌జుక్కు నీది, ఇనియావై ఇరుబతు లాంటివి రాశారు. తను 100కు పైగా పద్యగద్య రూపంలో పుస్తకాలు రాశారు.

    ఇక కరుణానిధి ఎప్పుడూ ఒక మాట చెబుతారు. అది " ఎన్ ఉరినం, మెలాన కళగం ఉదప్ పిరప్పగలే". దీని అర్థం "పార్టీలోని నా సోదరులారా మీరంతా నాప్రాణం కంటే ఎక్కువ" అని తెలుగులో అర్థం. ఈమాట కరుణ నోట నుంచి వచ్చినప్పుడల్లా పార్టీ శ్రేణుల్లో ఆ ఉత్సాహమే వేరుగా ఉంటుందట. ఇప్పుడు ఆ పిలుపునకు దూరమయ్యామని పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. కలైంజ్ఞర్ నీకు మళ్లీ జన్మంటూ ఉంటే తమిళగడ్డపైనే జన్మించాలయ్యా అంటూ కానరానిలోకాలకు వెళ్లిన తమ అభిమాన నేతను తలుచుకుంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+