వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్యోగులకు టాటా షాక్: పునర్నిర్మాణంలో సంచలన నిర్ణయాలు..

ఈ చర్యల వల్ల రూ.400కోట్ల మేర ఖర్చును తగ్గించుకోవచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. సంస్థలో వైట్ కాలర్ పాపులేషన్ ఆందోళన కలిగిస్తోందని,

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కంపెనీ పునర్మిర్మాణ ప్రక్రియలో భాగంగా టాటా మోటార్స్ కంపెనీ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాలపై ఖర్చు చేస్తున్నంత ఆర్థిక మొత్తాలను తగ్గించుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు బ్లూ కాలర్ ఉద్యోగాల్లో చాలావరకు కోత పడనుండగా.. వైట్ కాలర్ ఉద్యోగాల్లోను కొంతమేర కోత తప్పేట్లు లేదు.

పునర్నిర్మాణ చర్యలతో దాదాపు 1200-1300మంది ఉద్యోగులను వివిధ బ్రాంచ్ లకు కేటాయిస్తున్నారు. వేరే యూనిట్లకు తరలి వెళ్లకుంటే.. కంపెనీ విడిచిపెట్టిపోవాల్సిందిగా టాటా యాజమాన్యం నిర్మొహమాటంగా చెబుతోంది. ఇదే క్రమంలో ఇప్పటివరకు 2500 ఉద్యోగాలను కంపెనీ తొలగించడం గమనార్హం.

Workforce reshuffle to help Tata Motors save Rs 400 crore

కంపెనీ వేటు వేసిన వారిలో ఎక్కువగా కిందిస్థాయి ఉద్యోగులే ఉండటం గమనార్హం. దీనిపై స్పందించిన కంపెనీ హెచ్ఆర్ గజేంద్ర చందెల్.. పునర్నిర్మాణ ప్రక్రియ చేపట్టకపోతే ఉద్యోగులు ఖర్చలు రూ.400-రూ.500కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రత్యక్ష, పరోక్ష ప్రయోజనాల్లో ఇది చాలా ఎక్కువని, ఈ ఏడాది బడ్జెట్ రూపకల్పన చేసిన సమయంలోనే.. కొత్త విధివిధానాలన రూపొందించామని అన్నారు.

ఈ చర్యల వల్ల రూ.400కోట్ల మేర ఖర్చును తగ్గించుకోవచ్చునని అంచనా వేస్తున్నామన్నారు. సంస్థలో వైట్ కాలర్ పాపులేషన్ ఆందోళన కలిగిస్తోందని, 1500మంది మేనేజింగ్ డైరెక్టర్లను కూడా తొలగించే యోచనలో ఉన్నామని చీఫ్ ఎగ్జిక్యూటివ్ గ్యుయెంటర్ బచక్ గతంలో పేర్కొన్నారు. గత 18నెలల్లో టాటా మోటార్స్ లో 2500 వైట్ కాలర్ పొజిషన్స్ ఖాళీ అయ్యాయని, ఇవి పొదుపుకు సహకరిస్తున్నాయని కంపెనీ పేర్కొంది.

ప్రస్తుతం కంపెనీలో పనిచేస్తున్న బ్లూ కాలర్ ఉద్యోగాల్లో 10శాతం మేర కంపెనీ కోత పెట్టనుంది . ఈ లెక్కన 3వేల మంది ఉద్యోగులు కంపెనీ నుంచి బలవంతంగా బయటకి రాక తప్పదు. ఇక ఉత్పత్తి చర్యలను మెరుగుపరచడానికి 10శాతం వేతనాన్ని పనితీరుతో లింకు పెట్టింది.

వరుసగా గడిచిన మూడేళ్ల నుంచి నష్టాలనే చవిచూస్తూ వస్తున్న నేపథ్యంలో.. టాటా మోటార్స్ ఈ కొత్త విధివిధానాలను రూపొందించింది. బీఎస్-3వాహనాల ఇన్వెంటరీతో 2017ఆర్థిక సంవత్సరంలో రూ.2480కోట్ల నష్టాలను కంపెనీ మూటగట్టుకుంది.

English summary
Tata MotorsBSE -0.84 % is set to save Rs 300-400 crore in what’s termed the biggest restructuring exercise in the history of the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X