వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెర్లిన్ దాడి మాదే : ఇస్లామిక్ స్టేట్

జర్మనీ రాజధాని బెర్లిన్ లోని క్రిస్మస్ మార్కెట్ లో ట్రక్కు బీభత్సానికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

|
Google Oneindia TeluguNews

బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్ లోని క్రిస్మస్ మార్కెట్ లో ట్రక్కు బీభత్సానికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. సోమవారం రాత్రి క్రిస్మస్ మార్కెట్ లో పాదచారులపైకి నలుపు రంగు ట్రక్కు దూసుకెళ్ళి 12 మందిని పొట్టనబెట్టుకోగా, ఈ ఉగ్ర దాడిలో మరో 50 మంది వరకు గాయపడిన సంగతి తెలిసిందే.

ఈ దాడి ఘటనలో ఓ పాకిస్తాన్ యువకుడిని ట్రక్కు డ్రైవర్ గా భావించి తొలుత అదుపులోకి తీసుకున్న బెర్లిన్ పోలీసులు ఆ తరువాత అతడికి ఎలాంటి సంబంధం లేదని భావించి వదిలేశారు. అనంతరం ఈ దాడికి పాల్పడింది తమ సైనికుడేనని, సంకీర్ణ కూటమిలోని దేశాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయమని ఇచ్చిన పిలుపు మేరకే ఈ దాడి జరిగిందని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ 'అమాక్' ఒక ఆన్ లైన్ పోస్టులో వెల్లడించింది.

 Berlin Attack Is Our's : Islamic State

సిరియా, ఇరాక్ పై దాడులు నిర్వహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో అమెరికాతో కలిసి జర్మనీ కూడా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో జర్మనీపై ప్రతీకారేచ్చతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెర్లిన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఒకవైపు ఈ ఉగ్ర దాడిలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరోవైపు ఈ దాడి ఘటనకు కారణమైన నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. అయితే ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అని ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ దాడికి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

English summary
The ISIS-affiliated Amaq news agency released a statement saying Monday night's attack was carried out by "a soldier of the Islamic State" in response to calls by the group's leadership to target citizens of international coalition countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X