H-1B Visa: హెచ్1బీలపై కోర్టు సంచలన తీర్పు..! టెక్ కంపెనీలకు బిగ్ షాక్..!
అమెరికాలో కంపెనీలు విదేశీ నిపుణుల నియామకం కోసం తీసుకుంటున్న హెచ్1బీ వీసాలకు వార్షిక ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కంపెనీలు ఇరుకునపడ్డాయి. లక్ష డాలర్లు ఖర్చు చేసి విదేశీ నిపుణులకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్వదేశంలోనే ఉద్యోగుల్ని తీసుకుంటాయని ట్రంప్ భావిస్తే.. కంపెనీలు మాత్రం వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో రాజకీయంగానూ ఒత్తిడి పెరగడంతో కొత్తగా జారీ చేసే హెచ్1బీ వీసాలకు మాత్రమే లక్ష డాలర్ల ఫీజు చెల్లించేలా ఉత్తర్వుల్ని సవరించారు. అయితే దీనిపైనా టెక్ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి.
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజులకు వార్షిక ఫీజు లక్ష డాలర్లు వసూలు చేయడాన్ని సవాల్ చేస్తూ టెక్ కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన అమెరికా జిల్లా న్యాయమూర్తి బెరిల్ హోవెల్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చట్టపరమైన అధికారం పరిధిలో వ్యవహరించి, వీసా ఫీజును భారీగా పెంచాలని ఆదేశించారని తెలిపారు. వలసలను అరికట్టడానికి, అమెరికా కార్మికుల నియామకాల్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగమని తేల్చేశారు.

అయితే హెచ్1బీ వీసా ఫీజు పెంపుపై చట్టపరమైన సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ ట్రంప్ సర్కార్ మాత్రం వీటి వసూలునను కొనసాగించేందుకు ఈ తీర్పు అనుమతిస్తుంది. ట్రంప్ సర్కార్ చర్యను అడ్డుకోవాలని యుఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవచ్చని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు ట్రంప్‌కు హెచ్1బీ వీసాల ఫీజు పెంచే అధికారం లేదని ఛాంబర్ చేసిన వాదనను జడ్జి హోవెల్ తోసిపుచ్చారు. అధ్యక్షుడికి ఉన్న అధికారాల మేరకే ఈ నిర్ణయం ఉందన్నారు.

ఆర్థిక, జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యగా ట్రంప్ భావించే సమస్యను పరిష్కరించడానికి.. తనకు తగిన విధంగా నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడికి విస్తృత అధికారాన్ని ఇచ్చిందని జడ్జి తెలిపారు. చట్ట పరిధిలో దీన్ని వ్యతిరేకించే అవకాశం లేదన్నారు. ఈ వీసా ఫీజుల పెంపు చాలా కంపెనీలకు, ముఖ్యంగా చిన్న కంపెనీలకు హెచ్1 బీ వీీసాల భారం పెంచుతుందన్న ఛాంబర్ వాదనను ఆయన తోసిపుచ్చారు. దీంతో ఛాంబర్ దీనిపై అప్పీలు చేసేందుకు సిద్దమవుతోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications