తిరుగుబాటు కుట్ర!: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో అరెస్ట్
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను శనివారం(నవంబర్ 22) రోజున ఫెడరల్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దేశాధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా.. అధికారాన్ని నిలుపుకోవడానికి తిరుగుబాటు కుట్రకు పాల్పడ్డారన్న అభియోగాలపై ఇప్పటికే బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ శిక్ష అమలు జరగడానికి ముందుగానే.. ముందస్తు చర్యలో భాగంగా ఆయనను ఫెడరల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అరెస్ట్
శనివారం ఉదయం బోల్సోనారోను అరెస్ట్ చేసినట్లు.. ఆయనను రాజధాని బ్రసీలియాలోని పోలీసు కేంద్ర కార్యాలయానికి తరలించినట్లు బోల్సోనారో ప్రతినిధి ధ్రువీకరించారు. ఈ అరెస్టుపై స్పందించిన ఫెడరల్ పోలీసులు.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ఈ చర్య తీసుకున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తిరుగుబాటు కుట్ర కేసు నేపథ్యం
బోల్సోనారో 2019 నుంచి 2022 వరకు బ్రెజిల్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. 2022 అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా చేతిలో ఓడిపోయినప్పటికీ.. బోల్సోనారో ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి నిరాకరించారు. ఆ సమయంలో వేల సంఖ్యలో ఆయన మద్దతుదారులు హింసాత్మక ఘటనలకు, అల్లర్లకు పాల్పడ్డారు. పదవిలో కొనసాగేలా తిరుగుబాటు కుట్రకు బోల్సోనారో ప్రణాళికలు రచించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, మాజీ అధ్యక్షుడికి అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు, ప్రజాస్వామ్యంపై దాడులకు పాల్పడినందుకు సెప్టెంబర్‌లో 27 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
గృహ నిర్బంధం.. అప్పీలుకు చుక్కెదురు
బోల్సోనారో ఈ కేసు విచారణ సమయం నుంచే (ఆగస్టు) గృహ నిర్బంధంలో ఉన్నారు. అయితే, సుప్రీంకోర్టు విధించిన శిక్షపై ఆయన అప్పీలుకు వెళ్లినప్పటికీ, అక్కడ ఉపశమనం లభించలేదు. బోల్సోనారో తరఫు న్యాయవాదులు వాదిస్తూ, ఆయన ఆరోగ్యం క్షీణించిందని, జైలుకు వెళితే ప్రాణాలకు ముప్పు ఉందని, కాబట్టి గృహనిర్బంధంలోనే ఉంచాలని కోరారు. అయినప్పటికీ, కోర్టులు ఇప్పటివరకు ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే, ఆయన జైలు శిక్ష అనుభవించడానికి ముందు ముందస్తు అరెస్ట్‌గా దీన్ని భావిస్తున్నారు. బోల్సోనారో అరెస్ట్ బ్రెజిల్ రాజకీయాలలో ఒక కీలక పరిణామంగా నిలిచింది.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications