• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా షాకింగ్ ప్రకటన: కరోనా కంటే డేంజర్.. అంతుచిక్కని మరో వైరస్ వ్యాప్తి.. కజకిస్తాన్ లో మృత్యువిలయం

|

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం కుదేలైపోయినవేళ.. దానికంటే ప్రమాదకరమైన మరో వైరస్ పుట్టుకొచ్చింది. 'అంటు వ్యాధులకు పుట్టినిల్లు'గా అఖ్యాతిపొందిన చైనాయే ఈ సంచలన ప్రకటన చేసింది. ఏడు నెలల కిందట కరోనా వైరస్జ.. ఆ తర్వాత స్వైన్‌ఫ్లూ వైరస్‌ జీ4.. నిన్నగాకమొన్న బుబోనిక్‌ ప్లేగు.. ఇలా ఒక్కొక్కటిగా విజృంభిస్తుండగా.. ఇప్పుడు మరో అంతుచిక్కని వైరస్ కూడా విలయతాండవం చేస్తోంది. అయితే, ఈ ''అంతుచిక్కని న్యుమోనియా'వైరస్ ఎపిసెంటర్ కజకిస్తాన్ అని చైనా అధికారులు పేర్కొన్నారు.

సాయిరెడ్డికి దిమ్మతిరిగే పంచ్.. రఘురామ సాక్షిగా దేవధర్ ఎంట్రీ.. ప్రమాదంలో వైపీపీ.. సుజనా భారీ స్టెప్

చైనీస్ ఎంబసీ ప్రకటన..

చైనీస్ ఎంబసీ ప్రకటన..

దాదాపు 1800 కిలోమీటర్ల మేర తమతో సరిహద్దులు పంచుకునే పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత పడుతున్నారని చైనా తెలిపింది. దీనిపట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కజకిస్తాన్ లోని చైనా ఎంబసీ గురువారం సంచలన ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు, ఈ కొత్త వైరస్.. కరోనా మహమ్మారికంటే చాలా చాలా ప్రమాదకరమైందని, కొవిడ్-19 కంటే మరణాల రేటు అధికంగా ఉందని చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 1.23కోట్లకు, మరణాల సంఖ్య 5.6లక్షలకు పెరిగాయి. ఇక కొత్త వైరస్ విషయానికొస్తే..

కజకిస్తాన్ ఆగమాగం..

కజకిస్తాన్ ఆగమాగం..

ఇంకా పేరు పెట్టని ఓ వైరస్ కజకిస్తాన్ లో వేగంగా వ్యాప్తి చెందడంతో న్యుమోనియా బారినపడి ఇప్పటికే 1772 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ సంఖ్య కరోనా మరణాల కంటే 65 రెట్లు ఎక్కువని, ఒక్క జూన్ నెలలోనే ఏకంగా 628 మంది మృత్యువాత పడ్డారని చైనీస్ ఎంబసీ తెలిపింది. ప్రధానంగా కజకిస్తాన్ రాజధాని నూర్ సుల్తాన్ సిటీతోపాటు ఆత్రయూ, అకుటోబె, షిమ్కెంట్ తదిర ప్రాంతాల్లో ‘అంతుచిక్కని న్యుమోనియా' ప్రభావం అధికంగా ఉన్నట్లు కజకిస్తాన్ మీడియా సైతం రిపోర్టు చేసింది. ఇప్పటికే కరోనాతో అల్లాడుతోన్న ఆ దేశంలో 53వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా, అందులో 264 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కంటే డేంజర్ గా భావిస్తోన్న కొత్త వైరస్ వల్ల ఏకంగా 1772 మంది మృత్యువాతపడటం గమనార్హం.

అసలు దొంగలు దుబాయ్ అధికారులే.. బాంబు పేల్చిన స్వప్న సురేశ్.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలనం..

రోగ లక్షణాలు ఇవే..

రోగ లక్షణాలు ఇవే..

అంతుచిక్కని కొత్త వైరస్ సోకడం ద్వారా రోగి ‘అంతుచిక్కని న్యుమోనియా'కు గురవుతాడు. ముందుగా పొడిదగ్గు, చమటలు పట్టడం, జ్వరం, వణుకు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గుండె కొట్టుకునే వేగం పెరగడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. కొంచెం తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో వికారం, వాంతి చేసుకోవడం, కీళ్లు, కండరాలు పట్టేయడం, మానసిక స్థిమితం కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దాదాపు కొవిడ్-19 లక్షణాలు కూడా ఇవే అయినప్పటికీ, కొత్త వైరస్ బారిన పడితే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.

ఐదు రోజులుగా అన్నీ బంద్..

ఐదు రోజులుగా అన్నీ బంద్..

కొత్త వైరస్ కారణంగా కజకిస్తాన్ లో నివసిస్తోన్న చైనీయులు కూడా వరుసగా చనిపోతుండటంతో చైనీస్ ఎంబసీ ఈ మేరకు హెచ్చరిక ప్రకటన చేసింది. కొత్త వైరస్‌ గురించి విశ్లేషించేందుకు తన వంతు సాయం చేస్తానని తెలిపింది. అంతుచిక్కని న్యుమోనియాపై కజక్ సైంటిస్టులు, డాక్టర్లు ఇప్పటికే పని చేస్తున్నారు. ప్రభుత్వ పరంగానూ జాగ్రత్త చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొవిడ్-19 కోసం రూపొందించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు. కజకిస్తాన్ మొదటి ప్రెసిడెంట్, ప్రస్తుత సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్ నూర్ సుల్తాన్ నజర్బయేవ్ కూడా కరోనా కాటుకు గురికావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కొత్త వైరస్ గురించి కజకిస్తాన్ ప్రభుత్వం నేరుగా ప్రకటన చేయనప్పటికీ, ఆ దేశానికి చెందిన విశ్వసనీయ మీడియా ‘అంతుచిక్కని న్యుమోనియా' తీవ్రతను నిర్ధారించింది.

  ఘోర ప్రమాదం.. 52 మంది దుర్మరణం..!
  సరిహద్దులు దాటిందా?

  సరిహద్దులు దాటిందా?

  కజకిస్తాన్ లో అంతుచిక్కని న్యుమోనియా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రతి రోజూ 200కు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయని, అయితే, కరోనా లాగే స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లలో చాలా మంది డిశ్చార్జి అయిపోయి, ఇళ్లలోనే ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారని, తీవ్ర లక్షణాలు ఉన్నవాళ్లలో మాత్రం కరోనా కంటే మరణాల రేటు అధికంగా ఉందని ప్రఖ్యాత ‘కజిన్ఫోర్మ్' వార్తా సంస్థ పేర్కొంది. అయితే, ఈ కొత్త వైరస్ కజకిస్తాన్ సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వ్యాపించిందా లేదా అనేది ఖరారుకావాల్సి ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిపై ప్రకటన చేయాల్సిఉంది. కాగా, చైనీస్ ఎంబసీ చేసిన ఈ షాకింగ్ ప్రకటనను కజకిస్తాన్ ప్రభుత్వం ఖండించింది. దానికి సంబంధించిన వార్తను ఈ కిందున్న లింకులో చదవొచ్చు.

  పక్కదేశాల్లో చిచ్చు పెట్టడం చైనా తర్వాతే.. కజకిస్తాన్‌లో కొత్త వైరస్ వ్యాప్తి వట్టిదే.. అసలు కథ..

  English summary
  The Chinese Embassy in Kazakhstan on Thursday warned Chinese citizens living in the country of a local pneumonia of unknown cause, which local media reported has a "much higher" fatality rate than COVID-19. The unknown pneumonia in Kazakhstan caused 1,772 deaths in the first six months of the year.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more