Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!

ఇరాన్ (iran)పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన రెండో నెలకు చేరినా ఇంకా నిరాటంకంగా కొనసాగుతోంది. దీంతో యుద్దం నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడక తప్పని పరిస్ధితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) ఇరాన్ పై బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా 48 గంటల్లో ఇరాన్ లొంగిపోకపోతే విధ్వంసం తప్పదని ట్రంప్ చేసిన హెచ్చరికలతో ఇరాన్ ప్రజల కంటే గల్ఫ్ దేశాలు ఎక్కువగా వణుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాస అణుశక్తి సంస్థ ఐఏఈఏ మాజీ బాస్, నోబెల్ బహుమతి విజేత కూడా అయిన మొహమ్మద్ ఎల్ బరాదీ గల్ఫ్ దేశాలకు హెచ్చరికలు చేశారు.

ఇరాన్ నెక్ట్స్‌ టార్గెట్‌ 'బాబ్‌ అల్‌ మాండెబ్‌’..?
ఇరాన్ నెక్ట్స్‌ టార్గెట్‌ 'బాబ్‌ అల్‌ మాండెబ్‌’..?

ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికల నేపథ్యంలో, ఆయన ఈ ప్రాంతాన్ని "అగ్నిగోళంగా" మార్చకుండా నిరోధించాలని ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షక సంస్థ మాజీ డైరెక్టర్ మొహమ్మద్ ఎల్ బరాదీ (Mohamed ElBaradei) గల్ఫ్ దేశాలను కోరారు. గల్ఫ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి: దయచేసి, మరోసారి, ఈ ఉన్మాది ఈ ప్రాంతాన్ని అగ్నిగోళంగా మార్చకముందే మీ శక్తి మేరకు ప్రతిదీ చేయండి అని 1997 నుండి 2009 వరకు అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీకి నాయకత్వం వహించిన మొహమ్మద్ ఎల్-బరాదీ ఎక్స్ లో పోస్టు చేశారు.

Ex-IAEA Boss ElBaradei Urges Gulf States to Act on Trump s Iran Ultimatum Stop This Madness
మరో 48 గంటల్లో ప్రళయం.. ఇరాన్ ఖతం: ట్రంప్ ఫైనల్ వార్నింగ్
మరో 48 గంటల్లో ప్రళయం.. ఇరాన్ ఖతం: ట్రంప్ ఫైనల్ వార్నింగ్

ఒప్పందం కుదుర్చుకోకపోతే నరకం చూడాల్సి వస్తుందని ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన అల్టిమేటాన్ని ప్రస్తావిస్తూ.. ఎల్ బరాదీ మరో పోస్ట్‌లో ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ ఖాతాలతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌ను కూడా ట్యాగ్ చేశారు. ఈ పిచ్చిని ఆపడానికి ఏమీ చేయలేమా?!" అని ఆయన చైనా, రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖలను కూడా ట్యాగ్ చేస్తూ రాశారు. ఇరాన్ యుద్దంలో కీలకంగా మారిన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడమో లేదా ఒప్పందం కుదుర్చుకోవడమో చేయాలని ట్రంప్ తాజాగా పిలుపునిచ్చారు. గతంలో తాను ఇచ్చిన పది రోజుల గడువును గుర్తుచేస్తూ.. సమయం మించిపోతోంది, వారిపై నరకం విరుచుకుపడటానికి 48 గంటల సమయం మాత్రమే ఉందని హెచ్చరికలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+