భారత్ కు ట్రంప్ మంత్రి బిగ్ న్యూస్..! రష్యాకు షాకిచ్చిన వేళ..!
రష్యా నుంచి డిస్కౌంట్ పై చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధానికి ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) భారత్ (india) పై 50 శాతం సుంకాల మోత మోగించారు. ఇందులో 25 శాతం ప్రత్యక్ష సుంకాలు కాగా.. మరో 25 శాతం జరిమానా సుంకాలు. వీటిని తగ్గించాలంటూ భారత్ ఎన్నిసార్లు మొత్తుకున్నా ట్రంప్ కరుణించలేదు. పైగా భారత ప్రధాని మోడీ తనతో నేరుగా దీనిపై మాట్లాడలేదని, తన ఫోన్లు లిప్ట్ చేయలేదని ట్రంప్ సన్నాయినొక్కులు నొక్కుతూ వచ్చారు.
అయితే తాజాగా ట్రంప్ ఏర్పాటు చేసిన గాజా శాంతి బోర్డులో చేరేందుకు ఆహ్వానం అందినా భారత్ పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోవడం, అదే సమయంలో రష్యాతో చమురు దిగ్గుమతుల్ని సైతం తగ్గించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ రెండు అంశాలు ట్రంప్ ను ఆలోచనలోకి నెట్టాయి. అలాగే భారత్ తో వాణిజ్య ఒప్పందం కూడా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా ముందుకు సాగడం లేదు. దీంతో ట్రంప్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.

భారత్ పై గతేడాది విధించిన 50 శాతం పన్నుల్లో సగానికి సగం తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నట్లు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బ్రెస్సెంట్ వెల్లడించారు. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని తగ్గించుకోవడం వల్ల భారత్ పై సుంకాల్ని సగం తగ్గించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెసెంట్ ఈ విషయం వెల్లడించారు. రష్యా చమురు దిగుమతులను తగ్గించాలనే భారతదేశం యొక్క చర్య ప్రస్తుతం భారతీయ వస్తువులపై విధిస్తున్న మొత్తం 50 శాతం సుంకాలలో కనీసం 25 శాతం పాయింట్లను తగ్గించడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించిందని అన్నారు.

భారతదేశంపై మా 25 శాతం సుంకం భారీ విజయాన్ని సాధించింది. రష్యా చమురును భారత్ కొనుగోళ్లు కుప్పకూలాయి. సుంకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాటిని తొలగించడానికి ఒక మార్గం ఉందని ఊహించిట్లు స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు. తాజాగా ట్రంప్ కూడా భారత్ తో త్వరలో భారీ వాణిజ్య ఒప్పందం కుదరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
-
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
ఆంజనేయుడి దివ్యమంత్రం -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications