వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోకియా కష్టాలే మైక్రోసాఫ్ట్‌కు: ఉద్యోగులకు ఉద్వాసన

|
Google Oneindia TeluguNews

రెడ్‌మాండ్: తన స్మార్ట్‌ఫోన్‌ హార్డ్‌వేర్‌ వ్యాపారాన్ని క్రమబద్డీకరిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ బుధవారంనాడు ప్రకటించింది. దీని ఫలితంగా ఆ సంస్థ స్మార్ట్‌ఫోన్ల తయారీ వ్యాపారం నుంచి తప్పుకుుంటుందనే సంకేతాలు అందుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ క్రమబద్దీకరణ వల్ల 1,850 మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు సంస్థ తెలిపింది.

దాన్నిబట్టి స్మార్ట్‌ఫోన్ల వ్యాపారానికి ఫిన్నిష్‌ యూనియన్‌వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఫిన్లాండ్‌కు చెందిన టెలికాం ఎక్వి్‌పమెంట్‌ తయారీ కంపెనీ నోకియా నుంచి స్మార్ట్‌ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌ రెండేళ్ల క్రితం 720 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కస్టమర్ల మనసునుచ బట్టి స్మార్ట్‌ఫోన్లను తీసుకురాలేక నోకియా మార్కెట్‌ వాటా ను క్రమంగా కోల్పోయింది.

Microsoft logo

మైక్రోసాఫ్ట్‌ కూడా కస్టమర్ల వ్యవహారశైలిని పట్టుకోలేకపోయిందనే అభిప్రాయం ఉంది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ల తాకిడితో మైక్రోసాఫ్ట్ గురైనట్లు చెబుతున్నారు. దాంతో మైక్రోసాఫ్ట్‌ ఫోన్లను కొనే కస్టమర్ల సంఖ్య క్రమంగా తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే స్టార్ట్‌ఫోన్ల తయారీకి కంపెనీ మంగళం పాడుతున్నట్టు తెలుస్తోంది.

సంస్థ నిర్ణయం వల్ల 95 కోట్ల డాలర్ల వరకు భారం పడే అవకాశం ఉంది. ఇందులో 20 కోట్ల డాలర్లు కంపెనీతో ఒప్పందం చేసుకున్న ఇతర సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. మైక్రోసాఫ్ట్‌ తొలగించనున్న 1,850 మందిలో ఫిన్లాండ్‌లోని మైక్రోసాఫ్ట్‌ మొబైల్‌ ఒవైకి చెందిన 1,350 మంది, ఇతర దేశాల్లోని 500 మంది ఉన్నారు.

ఫిన్లాండ్‌లోనే మైక్రోసాఫ్ట్‌ స్మార్ట్‌ఫోన్లను డిజైన్‌ చేస్తోంది. ఇక్కడే అధికంగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. దీన్ని బట్టి మైక్రోసాఫ్ట్‌ స్మార్ట్‌ఫోన్లను ఇకపై డిజైనింగ్‌ లేదా తయారీ చేయదని మైక్రోసాఫ్ట్‌ అధికారి కల్లె కిలి తెలిపారు.

నిజానికి 1998 నుంచి 2011 వరకు ప్రపంచ మొబైల్‌ ఫోన్ల వ్యాపారాన్ని నోకియా శాసించింది. నోకియా ఫోన్లకు కస్టమర్లు ఫిదా అయ్యారు. తర్వాతి కాలంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన విండోస్‌ మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నోకియా స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే కస్టమర్లను ఆకట్టుకోలేకపోయాయి.

ఈ పరిస్థితిలో నోకియా మొబైల్‌ ఫోన్ల వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. కానీ ఈ కంపెనీ కూడా తన లుమియా శ్రేణి స్మార్ట్‌ఫోన్లతో కస్టమర్లను సొంతం చేసుకోలేకపోయింది. గత వారంలో ఫీచర్‌ ఫోన్ల వ్యాపారాన్ని ఫిన్నిష్‌ కంపెనీ హెచ్‌ఎండి గ్లోబల్‌, ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూప్‌నకు చెందిన ఎఫ్‌ఐహెచ్‌ మొబైల్‌కు విక్రయిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 35 కోట్ల డాలర్లనే విషయం తెలిసిందే.

English summary
Microsoft Corp. on Wednesday announced plans to streamline the company’s smartphone hardware business, which will impact up to 1,850 jobs. As a result, the company will record an impairment and restructuring charge of approximately $950 million, of which approximately $200 million will relate to severance payments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X