బగ్ పడితే రూ.10 లక్షలు.. హ్యాకర్లకు మైక్రోసాఫ్ట్ సవాల్
ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బగ్ బౌంటీలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. పరిమిత కాలానికిగాను బగ్ బంటీ ఆపరేషన్స్ వ్యయాన్ని దాదాపు రెట్టింపు చేసింది.
న్యూయార్క్: ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ బగ్ బౌంటీలకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. పరిమిత కాలానికిగాను బగ్ బంటీ ఆపరేషన్స్ వ్యయాన్ని దాదాపు రెట్టింపు చేసింది. 'బగ్ పట్టు రూ.10 లక్షలు పట్టు..' అంటూ హ్యాకర్లకు ఓపెన్ చాలెంజ్ విసిరింది.
తమ సేవల్లో లోపాలను పసిగట్టిన వారికి మైక్రోసాఫ్ట్ నగదు బహుమతిని ఆఫర్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా తమ ఆన్ లైన్ సేవల్లో తీవ్రమైన దాడులను, సెక్యూరిటీ లోపాలను గుర్తించిన హ్యాకర్లకు మొత్తం దాదాపు 20 లక్షలు (30 వేల డాలర్లు) వరకు చెల్లించనుంది.
వీటినలో కనీసం 500 డాలర్లుగాను, గరిష్టంగా 15 వేల డాలర్లు(రూ.10 లక్షలు) నజరానా చెల్లిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఇలా సమర్పించిన వాటిలో అర్హులైన వారికి కనీసం 500 డాలర్ల నుంచి 15 వేల డాలర్ల వరకు అందించనున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

అలాగే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 పోర్టల్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ చేంజ్ ఆన్ లైన్ కు సంబంధించి మార్చి1 - మే 1 మధ్య కాలంలో సమర్పించిన అర్హులైన హ్యాకర్లు డబుల్ బొనాంజాకు అర్హులవుతారని తెలిపింది.
ఇలా అందిన అర్హమైన బగ్ రిపోర్టులకు సుమారు 30 వేల డాలర్ల వరకు అందించనున్నట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొంది. దీనిపై మైక్రోసాఫ్ట్ నిర్ణయమే అంతిమమని, దాడి ప్రభావం ఆధారంగా ఈ చెల్లింపులు ఉంటాయని స్పష్టం చేసింది.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications