ఒకేసారి 10 మిస్సైళ్లు ప్రయోగించిన కిమ్-అమెరికాకు బిగ్ షాక్..!
ఇరాన్ వార్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ యుద్ధ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం గల్ఫ్ దేశాలకు విస్తరించింది. దీంతో అక్కడ నిత్యం బాంబు పేలుళ్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ యుద్దంలోకి నేరుగా ప్రవేశించకపోయినా రష్యా, చైనా పరోక్షంగా ఇరాన్ కు సాయం చేస్తున్నాయన్న అనుమానాలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా శత్రుదేశం ఉత్తరకొరియా (North Korea)తాజాగా 10 క్షిపణులను ఒకేసారి ప్రయోగించి సంచలనం రేపింది.
ప్రస్తుతం జపాన్ తీరంలో అమెరికా-దక్షిణకొరియా సంయుక్తంగా విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. తమకు ఉమ్మడి శత్రువైన ఉత్తర కొరియాకు తమ బలం ఏంటో చాటుకునేందుకు ఈ విన్యాసాలు చేపట్టాయి. అయితే వారికి తన బలం ఏంటో చూపించాలని భావించిన ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) స్వయంగా తన కుమార్తె కిమ్ జు ఏ (Kim Ju Ae)తో కలిసి ప్రత్యక్షంగా వెళ్లి ఏకంగా 10 క్షిపణుల్ని ప్రయోగించారు. దీంతో కిమ్ చర్య ప్రపంచ దేశాల్ని ఉలికిపాటుకు గురిచేస్తోంది.

తూర్పు సముద్రంవైపుగా ఈ మిస్సైళ్లను కిమ్ సైన్యం ప్రయోగించినట్లు దక్షిణకొరియా నిర్ధారించింది. అదే సమయంలో ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ బాలిస్టిక్ మిస్సైళ్లు ఏ తరహావో మాత్రం తెలియలేదు. అయితే అమెరికా-దక్షిణ కొరియాకు ఉమ్మడిగా వార్నింగ్ ఇచ్చేందుకే కిమ్ ఇలా క్షిపణులు ప్రయోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ వార్ లో బిజీగా ఉన్న అమెరికాకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటికే అమెరికాకు వ్యతిరేకంగా, ఇరాన్ కు మద్దతుగా గతంలో కిమ్ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఇరాన్ యుద్దం నుంచి అమెరికా దృష్టి మళ్లించేందుకే ఇలా ఒకేసారి పది మిస్సైళ్ల ప్రయోగం చేసారా అన్న చర్చ జరుగుతోంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications