చారిటీలపై బ్యాన్: హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ మరో షాక్, ఎందుకంటే

Posted By:
Subscribe to Oneindia Telugu

కరాచీ: ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ మరో షాకిచ్చింది. సయీద్‌కు చెందిన రెండు చారిటీ సంస్థల ఆస్తులను సీజ్ చేసింది. సయీద్‌ సంస్థలు జేయూడీ, ఎఫ్‌ఐఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులు, ఆరోగ్య సదుపాయాలను వెంటనే నిలిపివేస్తున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. సయీద్‌ ఆధ్వర్యంలో నడిచే సంస్థలను ప్రభుత్వ ఆధీనంలోని అకాఫ్‌ డిపార్టెమెంట్‌ స్వాధీనం చేసుకోవాల్సిందిగా సూచించింది. జేయూడీ నిర్వహించే సదస్సుల్లో పాల్గొనే ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను తెలుసుకోవాలని ఆదేశించారు.

Pakistan bans charities linked to UN designated terrorist

హఫీజ్ సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించిన మరుసటి రోజే అతడి సంస్థలపై చర్యలు తీసుకోవడం గమనార్హం. అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతుండటంతో సయీద్‌ను ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pakistan has officially banned two charities linked to Islamist leader Hafiz Saeed, an official said on Wednesday, in a move against the U N - designated "terrorist" that the United States says was behind the 2008 Mumbai.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి