భారత్ కు మద్దతుగా పాక్ నుంచి సంచలన లేఖ..! ఆపరేషన్ సింధూర్ భేష్..!
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత క్షీణించాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ గడ్డపై నుంచి భారత్ కు మద్దతుగా ఒకరు మాట్లాడితే, ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే, అందులో ఆపరేషన్ సింధూర్ ను ప్రశంసిస్తే..ఇదంతా నిజంగానే జరిగింది. పాకిస్తాన్ రచయిత ఒకరు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
కొంతకాలంగా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న బెలూచిస్తాన్ ప్రాంతానికి చెందిన నాయకుడు, మానవ హక్కుల కార్యకర్త, రచయిత మీర్ యార్ బలూచ్ తాజాగా మన విదేశాంగమంత్రి జైశంకర్ కు ఓ లేఖ రాశారు. ఇందులో పాకిస్తాన్-చైనా సంబంధాలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో చైనా తమ బలోచిస్తాన్ లో బలగాలు మోహరించే అవకాశముందని తెలిపారు. బలోచిస్తాన్ ఇప్పటికే పాకిస్తాన్ అణచివేతను ఎదుర్కుంటోందని గుర్తుచేశారు. గతేడాది మేలో పాకిస్తాన్ నుంచి బలోచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంది. అయితే అధికారికంగా మాత్రం పాక్ లో భాగంగానే ఉంది.

తాజా లేఖలో బలోచ్ నేత మీర్.. మోడీ నాయకత్వంలో భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా తీసుకున్న చర్యలని ప్రశంసించారు.
ఈ చర్యలు భారతదేశం యొక్క ఆదర్శప్రాయమైన ధైర్యం, ప్రాంతీయ భద్రత, న్యాయం పట్ల దృఢమైన నిబద్ధతకు నిదర్శనంగా మీర్ బలూచ్ అభివర్ణించారు. భారత్, బలోచిస్తాన్ మధ్య లోతైన చారిత్రక, సాంస్కృతిక,వాణిజ్య, ఆర్ధిక, దౌత్్, రక్షణ సంబంధాలు ఉన్నాయన్నారు. హింగ్లాజ్ మాతా ఆలయం వంటి పవిత్ర స్థలాలే ఇందుకు నిదర్శనమన్నారు. శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి, వాణిజ్యం, రక్షణ, భద్రత, భవిష్యత్తు ఇంధన సవాళ్లు మరియు దాచిన ముప్పులను తగ్గించడం వంటి స్నేహం, నమ్మకం, పరస్పర ప్రయోజనాలను పెంపొందించడంలో భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు.

79 ఏళ్లుగా పాకిస్తాన్ చేతుల్లో నలిగిపోయిన బలూచ్ ప్రజలు సార్వభౌమత్వం పొందేందుకు సమయం ఆసన్నమైనందన్నారు.
బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్, చైనా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక కూటమిని తీవ్ర ప్రమాదకరంగా భావిస్తున్నారని తెలిపారు.ఇస్లామాబాద్ సహకారంతో బీజింగ్ చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ (CPEC)ను దాని చివరి దశలకు తీసుకెళ్లిందని హెచ్చరించారు. బలూచిస్తాన్ రక్షణ, స్వాతంత్ర్య దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేయకపోతే, దీర్ఘకాల నమూనాల ప్రకారం వాటిని నిర్లక్ష్యం చేయడం కొనసాగితే, కొన్ని నెలల్లోనే చైనా తన సైనిక దళాలను బలూచిస్తాన్‌లో మోహరించగలదని పేర్కొన్నారు. 60 మిలియన్ల బలూచ్ ప్రజల సంకల్పం లేకుండా బలూచిస్తానీ గడ్డపై చైనా బూట్లు ఉండటం భారత్ మరియు బలూచిస్తాన్ భవిష్యత్తుకు ఊహించలేని ముప్పు, సవాల్ గా మారబోతోందని హెచ్చరించారు.
-
ఆంజనేయుడి దివ్యమంత్రం -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
Hormuz: హార్ముజ్ కోసం రంగంలోకి 35 దేశాలు-భారత్ కీలక నిర్ణయం..! -
షుగరు బాధితులు వేసవిలో ఎలాంటి స్నాక్స్ తినాలి..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications