షాక్: మోటార్ సైకిలిస్టుపై జంప్ చేసిన పాము, కారణమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

థాయ్ లాండ్:యూట్యూబ్ లో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. వేగంగా ఓ బైక్ పై వెళ్తున్న మోటార్ సైకిలిస్టుపై ఓ పాము జంప్ చేసేందుకు ప్రయత్నించింది.అయితే పామును చూసిన మోటార్ సైకిలిస్టు ఆ పాము నుండి జాగ్రత్తగా తప్పించుకొన్నాడు.

బైక్ పై ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో రోడ్డును దాటే పాములను చూస్తే ఒళ్ళు జలదరిస్తోంది.అయితే థాయ్ లాండ్ లో బైక్ పై ప్రయాణీ్స్తోన్న ఓ వ్యక్తిని ఓ పాము లిఫ్ట్ అడిగినట్టుగా మోటార్ సైకిల్ పై జంప్ చేసింది.

ఈ నెల 16వ, తేదిన థాయ్ లాండ్ లోని లాంపాంగ్ రోడ్డులో పట్టపగలు ఓ వ్యక్తి బైక్ పై వేగంగా వెళ్తున్నాడు.అతడి వెనకాలే ఓ కారులో కొంతమంది ప్రయాణీస్తున్నారు. అయితే వారు సరదాగా తమ కెమెరాల్లో రోడ్డును రికార్డ్ చేస్తున్నారు.

అదే సమయంలో రోడ్డును దాటేందుకు ముళ్ళ పొదల్లో నుండి ఓ పెద్దపాము రోడ్డుపైకి వచ్చింది. అయితే అదే సమయంలో మోటార్ బైక్ , కారు అదే ప్రాంతానికి వచ్చాయి.

ఈ వాహానాల శబ్దం విన్న పాము తనను తాను రక్షించుకొనేందుకుగాను జంప్ చేసింది. ఆ పాము మోటార్ సైకిలిస్టును లిఫ్ట్ అడిగినట్టుగా జంప్ చేసింది.అయితే పాము రోడ్డును దాటేందుకు జంప్ చేసిన విషయాన్ని పసిగట్టిన ఆ వ్యక్తి బైక్ వేగాన్ని మరింత పెంచాడు.

snake

దీంతో పాము తృటిలో మోటార్ బైక్ పై పడకుండా రోడ్డును దాటింది.పాము జంప్ చేయకపోతే మోటార్ సైకిల్ కింద పడేది. ఆ వ్యక్తి వేగాన్ని పెంచకపోతే పాము మోటార్ సైకిల్ పై పడేది. ఆ వేగంలో మోటార్ సైకిలిస్టుపై పడితే ఆయనను తప్పక కాటేసేది.

ఆ పాము తీవ్రమైన విష సర్పం.అయితే ఈ వీడియోను ఈ నెల 17వ, తేదిన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.అయితే ఈ వీడియోకు ఇప్పటికే 20 లక్షలమంది చూశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A video viral on Youtube, Snake jumps on motorcyclists in Thailand. this video posted on youtube on 17 April.
Please Wait while comments are loading...