USA: యథేచ్ఛగా కాల్పులు- రక్తమోడిన బర్త్ డే ఫంక్షన్.. దారుణం
అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. కాలిఫోర్నియాలో తాజాగా కాల్పుల ఉదంతం చోటు చేసుకుంది. ఫ్యామిలీ బర్త్ డే పార్టీపై యథేచ్ఛగా కాల్పులు జరిపారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. కాల్పులు జరిగిన ప్రదేశం మొత్తం కూడా బాధితుల ఆర్తనాదాలతో నిండిపోయింది.
అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతంలోని స్టాక్టన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టాక్టన్లో నివాసం ఉంటోన్న ఓ కుటుంబం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్ లో ఈ సెలెబ్రేషన్స్ ను ఏర్పాటు చేసింది. లూసిల్ అవెన్యూలోని 1900 బ్లాక్‌లో ఉందీ ఫంక్షన్ హాల్. వారి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు.

పార్టీ జోరుగా సాగుతున్న వేళ హఠాత్తుగా సాయుధులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటివరకు కోలాహలంగా కనిపించిన ఆ ప్రదేశం అంతా కూడా రక్తసిక్తమైంది. బాధితుల హాహాకారాలతో మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందిన వెంటనే శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
పిల్లలు, మహిళలతో స్టాక్టన్లో నివాసం ఉంటోన్న పలువురు ఈ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యారని, బుల్లెట్ గాయాలయిన వారిలో పిల్లలు కూడా ఉన్నారని షెరీఫ్ ప్రతినిధి హీథర్ బ్రెంట్ తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించామని, ఈ కాల్పుల వెనుక ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అన్నారు. ఇది యాదృచ్ఛికంగా జరిగినట్టుగా భావించట్లేదని పేర్కొన్నారు. దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అధికారులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
🚨 BREAKING: Numerous Emergency crews are on scene of a major Mass shooting at a birthday as multiple children have been shot with fatalities
— The Surreal D2 (@d2wuzup) November 30, 2025
4 confirmed dead and as many as 19 injured.
Pray for Stockton. 😢🙏
#Stockton | #California https://t.co/Eg33ahyRUW
ఈ విషాదానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకోవడానికి డిటెక్టివ్లు చురుకుగా పనిచేస్తున్నారని, ఈ ఘటనలో బాధితులు, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తోన్నామని హీథర్ బ్రెంట్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం, వీడియో ఫుటేజ్ లేదా ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరైనా వెంటనే శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
-
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications