Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

US- Iran War : మళ్లీ మొదలైన వార్..! హార్ముజ్ లో అమెరికా-గల్ఫ్ పై ఇరాన్..!

ఇరాన్ (iran) యుద్దానికి రెండు వారాల సీజ్ ఫైర్ ప్రకటించిన అమెరికా (US).. ఆ తర్వాత పాకిస్తాన్ లో 21 గంటల పాటు జరిగిన చర్చలు విఫలం కావడంతో రగిలిపోయింది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి (strait of hormuz)లో తిరిగే ఇరాన్ నౌకల్ని టార్గెట్ చేస్తామంటూ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. అన్నట్లుగానే తన నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చేశారు. ఈ సాయంత్రం నుంచి ఇరాన్ పోర్టుల దిగ్బంధం ప్రారంభించినట్లు అమెరికా ప్రకటించింది. ఈ నిర్ణయంపై ఇరాన్ అంతకు ముందే తీవ్రంగా స్పందించింది.

Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..!
Trump vs Pope: ట్రంప్ కు పోప్ లియో ఘాటు కౌంటర్-ఇరాన్ వార్ పై మరో షాక్..!

హార్ముజ్ జలసంధిలోని ఇరాన్ ఓడరేవులన్నింటినీ అమెరికా దిగ్బంధించడం ప్రారంభించింది. ఇది విస్తృత యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. అణు కార్యక్రమం, హార్ముజ్ నియంత్రణ విషయంలో ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడానికి సుముఖత చూపకపోవడంతో అమెరికా వారి పోర్టుల్ని దిగ్బంధించడం ప్రారంభించింది. కానీ ఇది ప్రపంచ మార్కెట్లను అస్థిరపరిచి, అమెరికాను సుదీర్ఘకాలం కొనసాగే యుద్ధంలోకి మరింతగా లాగే ప్రమాదం పొంచి ఉంది.

US Blockades Iran Ports Tehran Warns No Port In Region Will Be Safe Amid Piracy Claims
ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!!
ట్రంప్‌కు భారీ షాక్! ఇరాన్ విషయంలో అంతర్జాతీయ ట్విస్ట్!!

హార్ముజ్ జలసంధిలో అమెరికా తలపెట్టిన నౌకల దిగ్బంధనానికి ముందే ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో.. ఇరాన్ ఓడరేవులపై ఏ దాడి జరిగినా ప్రతీకార చర్యలు ఉంటాయని సాయుధ దళాల కేంద్ర ప్రధాన కార్యాలయం హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ , ఒమన్ సముద్రంలో భద్రత అనేది అందరి కోసం లేదా ఎవరి కోసం కాదని తెలిపింది. ఇరాన్ ఓడరేవులకు ముప్పు వాటిల్లితే, ఈ ప్రాంతంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+