కరోనా వ్యాక్సిన్లతో సహజ రోగనిరోధక శక్తి- భవిష్యత్‌ వైరస్‌లకూ చెక్‌-తాజా అధ్యయనం

ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రపంచదేశాలు దీని ప్రభావాన్ని, రాబోయే వేరియంట్ల ప్రభావాన్ని అధ్యయనం చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా కరోనాకు వ్యతిరేకంగా ప్రస్తుతం వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఎంతమేర పనిచేస్తున్నాయనే దానిపై పలు అధ్యయనాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన రాక్‌ఫెల్లర్‌ యూనివర్శిటీ శాస్తవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో లభించిన ఫలితాలు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించే విధంగా ఉన్నాయ.

Recommended Video

    Vaccination Boost Natural Immunity దీర్ఘకాలం పాటు మనిషి శరీరంలో | COVID 19 Study || Oneindia Telugu
     కరోనాపై వ్యాక్సిన్ల ప్రభావమెంత ?

    కరోనాపై వ్యాక్సిన్ల ప్రభావమెంత ?

    గతేడాది బయటపడిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ పలు వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి. భవిష్యత్తులో మానవ జీవితాల్ని వ్యాక్సిన్లు ఎంతగానో ప్రభావితం చేయబోతున్నట్లు భావిస్తున్న ఆయా దేశాలు ఇప్పుడు వాటి అభివృద్ధి కోసం సీరియస్‌గా పనిచేస్తున్నాయి. అదే సమయంలో వ్యాక్సిన్లు కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో ఎంత మేర ప్రభావం చూపుతున్నాయనే దానిపైనా అధ్యయనాలు నిర్వహిస్తున్నాయి. వీటి ఆధారంగానే వ్యాక్సిన్ల భవిష్యత్తు కూడా ఆధారపడబోతోంది.

     యూఎస్‌ రాక్‌ఫెల్లర్‌ వర్సిటీ తాజా అధ్యయనం

    యూఎస్‌ రాక్‌ఫెల్లర్‌ వర్సిటీ తాజా అధ్యయనం


    ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కరోనాపై పోరులో ఎంత మేర ప్రభావం చూపుతున్నాయనే అంశంపై యూఎస్‌కు చెందిన రాక్‌ఫెల్లర్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇందులో పలు ఆసక్తికర ఫలితాలు లభించాయి. అలాగే మానవాళి భవిష్యత్తుకు సంబంధించి ఆశాజనకమైన ఫలితాలు కూడా లభించాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ల వాడకం వల్ల కరోనాను నిజంగానే ఎదుర్కొనగలమా లేదా అన్న అంశంపై ఈ అధ్యయనం ఓ మార్గదర్శిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తోంది. దీంతో ఈ ఫలితాలపై భారత్‌లోనూ చర్చ జరుగుతోంది.

    వ్యాక్సిన్లతో సహజ రోగనిరోధకశక్తి

    వ్యాక్సిన్లతో సహజ రోగనిరోధకశక్తి


    కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా మనుషుల్లో సహజ రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని రాక్‌ఫెల్లర్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. అంటే ప్రస్తుతం వాడుతున్న వ్యాక్సిన్లతో సహజంగా రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని, అది కచ్చితంగా కరోనా వైరస్‌పై పోరాడే స్దాయిలో ఉంటుందని శాస్త్తవేత్తలు తేల్చారు. వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల మనిషి శరీరంలోని రోగనిరోధక వ్యవస్ధలో ఉన్న మెమరీ బీ కణాలు వైరస్‌ ప్రభావాన్ని తటస్ధం చేస్తున్నట్లు గుర్తించారు. అవి రోగనిరోధక రిజర్వాయర్‌గా ఏర్పడి వైరస్‌పై పోరాడుతున్నట్లు నిర్ధారించారు. వీటి ప్రభావం దీర్ఘకాలం పాటు శరీరంపై ఉంటుందని గుర్తించారు.

     తాజా వేరియంట్లనూ ఎదుర్కొనే సామర్ధ్యం

    తాజా వేరియంట్లనూ ఎదుర్కొనే సామర్ధ్యం

    ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్లు అన్నింటికీ భవిష్యత్‌ వైరస్‌లపైనా పోరాడే సామర్ధ్యం ఉందని రాక్‌ఫెల్లర్ యూనివర్శిటీ అధ్యయనం తేల్చింది. అంటే ఇప్పటికే బయటపడిన వైరస్ రకాలతో పాటు భవిష్యత్తులో వచ్చే రకాలపైనా పోరాడే శక్తి వీటికి ఉందంటున్నారు. ఆ రకంగా వ్యాక్సిన్లు సహజసిద్దమైన రోగనిరోధక వ్యవస్ధను అభివృద్ధి చేస్తున్నట్లు అధ్యనయంలో స్పష్టమైంది.
    అలాగే దీర్ఘకాలం పాటు మనిషి శరీరంలో ఉండటం ద్వారా ఇతర వైరస్‌లను కూడా ఇవి సమర్దంగా ఎదుర్కొంటాయని తేల్చారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+