Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇరాన్ వార్ వ్యతిరేకించిన అధికారికి ట్రంప్ షాక్..! వైట్ హౌస్ కీలక నిర్ణయం..!

ఇరాన్ (iran) లో ఇజ్రాయెల్ తో కలిపి అమెరికా (US) చేపట్టిన యుద్దం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఫలితం లభించలేదు. మరోవైపు ఈ యుద్ధంపై అమెరికాలో సైతం వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ వార్ ను వ్యతిరేకిస్తూ అమెరికా ఉగ్రవాద నిరోధక దళం ఛీఫ్ జో కెంట్ (joe kent) తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా అమెరికాతో పాటు పలు దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ విధానాల్ని సొంత అధికారులే వ్యతిరేకిస్తున్నారని ఇరాన్ కూడా ట్వీట్లు చేస్తోంది.

ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..!
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..!

ఈ నేపథ్యంలో వైట్ హౌస్ (white house) నష్టనివారణ చర్యలకు దిగింది. జో కెంట్ రాజీనామా వ్యవహారంపై స్పందించడంతో పాటు దీనిపై విచారణకు సైతం ఆదేశించింది. ఇరాన్ వార్ ఆపరేషన్స్ లో ఆయన పాత్ర లేదని స్పష్టం చేయడంతో పాటు, ప్రభుత్వంలో ఎక్కడైనా సమాచారం లీక్ అయిందేమో గుర్తించేందుకు అంతర్గత విచారణ జరుగుతోందని ప్రకటించింది. ఇరాన్ పై దాడుల తర్వాత ట్రంప్ సర్కార్ పై అంతర్గత విభేదాలపై ప్రశ్నలు తలెత్తిన నేపథ్యంలో వైట్ హౌస్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

White House resigned anti-terrorism unit chief Joe Kent Not in Iran Op Probe Targets Admin Leaker
ఇరాన్ వార్ ఎఫెక్ట్- ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్..!
ఇరాన్ వార్ ఎఫెక్ట్- ట్రంప్ ప్రభుత్వంలో తొలి వికెట్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌పై పూర్తి విశ్వాసం ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఇవాళ ఫాక్స్ న్యూస్‌తో చెప్పారు. తద్వార పరిపాలన యంత్రాంగం యొక్క కీలక నిర్ణయాధికారానికి, పదవి నుంచి వైదొలుగుతున్న ఆ అధికారికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎనిమిది నెలల కన్నా తక్కువ కాలం ఉగ్రవాద నిరోధక సంస్థకు నాయకత్వం వహించిన కెంట్.. మంగళవారం తన రాజీనామాను ప్రకటించారు. ఈ వివాదం కారణంగా ట్రంప్ పరిపాలనలో రాజీనామా చేసిన మొదటి ఉన్నతాధికారి ఆయనే అయ్యారు. దీంతో జాతీయ భద్రతా నాయకత్వంలో ఐక్యతను చూపించుకోవడానికి వైట్ హౌస్ ప్రయత్నిస్తోంది. అంతర్గత వివరాలను ఎవరు లీక్ చేసి ఉండవచ్చో గుర్తించడంపై ఇప్పుడు దృష్టి సారించామని లీవిట్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+