వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 వేల వీసాలు: బ్రిటన్‌కు వెళ్లే వారికి ఆఫర్: రిషి సునాక్

|
Google Oneindia TeluguNews

బ్రిటన్ కూడా భారతీయులకు మంచి ఆఫర్ ఇచ్చింది. ఆ దేశం వెళ్లాలనుకొనే వారికి ఏటా 3 వేల వీసాలు అందించే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు ఆ దేశ ప్రధానమంత్రి రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జి-20 సదస్సులో భాగంగా భారత ప్రధాని మోడీతో సునాక్‌ కొద్దిసేపు ముచ్చటించారు. ఆ తర్వాత కొద్ది గంటల్లో బ్రిటన్‌ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది.

బ్రిటన్‌ పౌరులు సైతం భారత్‌లో నివసించడానికి, పనిచేయడానికి కూడా వీలు కల్పించే ఈ పథకాన్ని 2023 సంవత్సరం మొదట్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న డిగ్రీ పట్టభద్రులైన భారతీయ పౌరులు బ్రిటన్‌కు వచ్చి రెండేళ్ల వరకూ చదువుకోవడంతోపాటు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా ఏటా 3వేల వీసాలు అందజేస్తాం అని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది.

yearly 3 thousand visa to indians

వాణిజ్యం, రక్షణ, భద్రత, రవాణా రంగాల్లో పరస్పర సహకారంపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌తో మోడీ చర్చించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌, సింగపూర్‌ ప్రధాని లీ హెసియెన్‌, జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌, ఆస్ట్రేలియా, ఇటలీ ప్రధానులు ఆల్బనీస్‌, మెలోనీలతో వివిధ అంశాలపై చర్చించారు.

సౌదీ అరేబియా కూడా నిబంధనలను సులభతరం చేసింది. అంతకుముందే బ్రిటన్ కూడా ఆఫర్ ఇచ్చింది. దీంతో విదేశాలకు వెళ్లే భారతీయులకు మేలు జరిగినట్టు అయ్యింది.

English summary
yearly 3 thousand visa to indians uk government has announce this offer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X