జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షంలో మరోసారి చేపలు: నల్లరంగులో, వింత ఆకారం, వండి తింటే అంతే సంగతులు

|
Google Oneindia TeluguNews

ఎడతెగని వానతో జనం ఇబ్బందులు మాములుగా లేవు. వాన వచ్చే సమయంలో అప్పుడప్పుడు వడగళ్లు పడతాయి. కానీ కొన్నిసార్లు చేపలు కూడా పడుతున్నాయి. దీంతో వాటిని పట్టుకునేందుకు జనం తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇటీవల కాళేశ్వరంలో చేపల వర్షం పడింది. ఖమ్మం, జగిత్యాలలో సేమ్ అలానే పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల చేపల వాన కురిసింది. సాయినగర్ కాలనీలో వర్షంతోపాటు చేపలు నేల మీద పడ్డాయి. ఆ చేపలను చూసి స్థానికులు నివ్వెరపోయారు. ఆ చేపలను కొందరు తమ ఇళ్లకు తీసుకెళ్లారు.

కొట్టుకొచ్చిన చేపలు.. జనం ఆశ్చర్యం

కరీంనగర్-జగిత్యాల బైపాస్ రోడ్డుపై వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. అటు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో పాటు చేపలు కొట్టుకొస్తున్నాయి. దీంతో చేపలు పట్టుకునేందుకు జనాలు తరలి వస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో తరుచూ వింత జరిగింది. కాళేశ్వరంలో వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు కూడా పడ్డాయి. ప్రాణంతో ఉన్న వాటిని కొందరు ఇళ్లకు తీసుకెళ్లారు. మహదేవ్ పూర్ మండలంలో అటవీ ప్రాంతంలో చేపల వర్షం కురిసింది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు చేపలు కనిపించడంతో వాటిని పట్టుకున్నారు.

నల్ల రంగులో, వింత ఆకారం

నల్ల రంగులో, వింత ఆకారం

చేపలు నల్ల రంగులో ఉన్నాయి. తినడానికి పనికి రావని చెబుతున్నారు. ఆ చేపల ఆకారం ఎంత వికృతంగా ఉండటంతో వాటిని పట్టుకోవడానికి కొందరు వెనకడుగు వేస్తున్నారు. ఆ చేపలన్నీ మేఘాల నుంచి కిందకు పడేవి కాదు. ఆకాశంలో చేపలు ఉండటం అసాధ్యం. వర్షాకాలం ప్రారంభంలో చెరువులు, కుంటల్లో లో ప్రెజర్ ఏరియా క్రియేట్ అవుతుంది. ఆ సమయంలో యాంఫీబియస్ నేచర్ ఉన్న నల్లటి చేపలు గాల్లోకి ఎగురుతాయి. వీటికి నేల మీద, నీటి మీద బతికే శక్తి ఉంటుంది. వర్షం, గాలి వచ్చిన సమయంలో ఇవి గాల్లోకి ఎగిరి మళ్లీ వర్షంతో పాటు కిందకు పడతాయి.

ఫ్యాక్టరీ సమీపంలో

ఫ్యాక్టరీ సమీపంలో

రసాయనాలు వదిలే ఫ్యాక్టరీల సమీపంలో ఉండే చెరువులు, కుంటలు కలుషితం అవుతాయి. అలాంటి వాటిల్లో నల్లటి చేపలు ఎక్కువగా ఉంటాయి. అయితే వర్షం పడుతున్న సమయంలో రసాయనాల ఎఫెక్ట్‌తో చేపలకు ఒక్కోసారి ఆక్సిజన్ అందదు. దీంతో అవి గాల్లోకి ఎగురుతుంటాయి. గాల్లోకి ఎగిరిన చేపలు వర్షాలకు ఎదురీది రోడ్లు పొల్లాల్లోకి వస్తాయి. వీటిని జనాలు వండుకు తింటే ప్రాణాలకే ప్రమాదం అని జువాలజీ ప్రొఫెసర్లు చెబుతున్నారు. సో ఫ్రీగా దొరికాయి కదా అని ఆ చేపలను తినొద్దు. తింటే లేని ప్రమాదం కొని తెచ్చుకోవడమే అవుతుంది.

English summary
rain effect:black fish are come to cloud, do not cook this fish professor said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X