కొత్తగూడెం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వనమా రాఘవేంద్రరావు అరెస్ట్..? బెయిల్ రాకుండా కౌంటర్ వేస్తాం: పోలీసులు

|
Google Oneindia TeluguNews

రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఆత్మహత్య చేసుకునే ముందు రామకృష్ణ సెల్పీ వీడియో తీసి.. అందులో వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు పేరును ప్రస్తావించారు. ఆయన వల్లే తాము సూసైడ్ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సెల్ఫీ వీడియో వైరల్ కాగా.. ప్రభుత్వం కూడా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్ర రావును అరెస్ట్ చేసింది.

సెల్పీ వీడియో..

సెల్పీ వీడియో..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవేంద్ర రావు కారణమని ఆరోపిస్తూ బాధితుడు తీసిన సెల్ఫీ వీడియో ట్రోల్ అవుతుంది. రాజకీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే కొడుకు నీచానికి పాల్పడుతాడా? అంటూ ఎమ్మెల్యే రాజీనామాకు కూడా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ప్రతిప‌క్షాలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేశారు.

కేసులు

కేసులు


వనమా రాఘవేంద్ర రావుపై 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బెయిల్‌కు అప్లై చేసినా కూడా రాకుండా కౌంటర్ దాఖలు చేస్తామని అంటున్నారు. రాఘవ తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కూడా తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ఎలాంటి విచారణకైనా సహకరిస్తామని స్పష్టం చేశారు.

భార్య, పిల్లలు సహా

భార్య, పిల్లలు సహా

కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 3వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్య కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఆత్మహత్యకు వనమా రాఘవేంద్ర రావు కారణమని రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకోగా.. అది బయటకు వచ్చింది.

వేధింపులు

వేధింపులు


మీ సేవ నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీవీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో రామకృష్ణ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతం అయ్యాడు. ఏ భర్త కూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు.

వారిని వదిలిపెట్టరని..

వారిని వదిలిపెట్టరని..

తాను చనిపోతే నా భార్య, పిల్లలను వదిలిపెట్టరు అందుకే.. వారితోపాటు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. తన సోదరుడు, అక్క కూడా ఇబ్బందిపెట్టారని చెప్పారు. వనమా.. తన భార్యను హైదరాబాద్‌ తీసుకొస్తేనే సమస్యను పరిష్కారిస్తానని నీచంగా మాట్లాడాడు. వీరివల్ల మానసికంగా కృంగిపోయి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తెలిపాడు.

English summary
trs mla vanama venkateshwar rao son raghavendra rao arrested. he harass ramakrishna family. ramakrishna video goes viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X