వనమా రాఘవేంద్రరావుకు 14 రోజుల రిమాండ్.. నేరం అంగీకారం..?
రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో అరెస్టయిన వనమా రాఘవేంద్రను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాఘవను ప్రాథమికంగా విచారించిన అనంతరం పోలీసులు కొత్తగూడెంలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దీంతో అతనికి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతనిని భద్రాచలం జైలుకు తరలించారు. రామకృష్ణను బెదిరించినట్టు రాఘవ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

11 కేసులు
గతంలో
అతడిపై
11
కేసులు
ఉన్నట్టు
ఏఎస్పీ
రోహిత్
రాజ్
తెలిపారు.
రామకృష్ణ
కుటుంబం
ఆత్మహత్య
కేసులో
రాఘవతో
పాటు
8
మందిపై
ఎఫ్ఐఆర్
నమోదు
చేశారు.
ఈ
కేసుకు
సంబంధించి
రాఘవతో
పాటు
మరో
ఇద్దరిని
అరెస్ట్
చేయగా,
మిగిలినవారు
పరారీలో
ఉన్నారు.
తన
కుమారుడిపై
ఆరోపణలు
రావడంతో
ఎమ్మెల్యే
వనమా
వెంకటేశ్వరరావు
బహిరంగ
లేఖ
రాయడం
తెలిసిందే.
తన
కుమారుడు
పోలీసు
విచారణకు
సహకరించేలా
చేస్తానని
ఆయన
స్పష్టం
చేశారు.

సెల్పీ వీడియో
ఆత్మహత్య చేసుకునే ముందు రామకృష్ణ సెల్పీ వీడియో తీసి.. అందులో వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు పేరును ప్రస్తావించారు. ఆయన వల్లే తాము సూసైడ్ చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సెల్ఫీ వీడియో వైరల్ కాగా.. ప్రభుత్వం కూడా స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్ర రావును అరెస్ట్ చేసింది. వనమా రాఘవేంద్ర రావుపై 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

3వ తేదీన ఘటన
కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 3వ తేదీన పాల్వంచలోని పాత బజారుకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కూతుళ్లు, సాహితీ, సాహిత్య కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఆత్మహత్యకు వనమా రాఘవేంద్ర రావు కారణమని రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకోగా.. అది బయటకు వచ్చింది.

రిమాండ్
మీ సేవ నిర్వాహకుడు రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీవీడియో ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో రామకృష్ణ తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవేంద్రరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. వనమా రాఘవా తనను మానసికంగా వేధించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. వనమా అరాచకాలను చెబుతూ కన్నీటిపర్యంతం అయ్యాడు. ఏ భర్త కూడా వినకూడని మాటలను రాఘవ అన్నారని ఆవేదన చెందాడు. రాజకీయ, ఆర్థిక బలంతో రాఘవ.. పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించాడు. దీంతో రాఘవేంద్రను అరెస్ట్ చేసి.. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.