నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ka paul మళ్లీ వేశాడు, మునుగోడులో గెలుస్తారట, వరాలు కూడా ప్రకటించేశారు

|
Google Oneindia TeluguNews

కేఏ పాల్ ఇటీవల చాలా యాక్టివ్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో వరసగా పర్యటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో అన్నీ చోట్ల పోటీ చేస్తోందని చెబుతున్నారు. తాజాగా మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక గురించి రియాక్ట్ అయ్యారు. తన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలిపారు.

 గిప్ట్ ఇవ్వబోతున్నా..

గిప్ట్ ఇవ్వబోతున్నా..

మునుగోడు యువతకు మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నానని కేఏపాల్ తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీన మునుగోడులో ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తున్నాని ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీన శాంతి సభ ఏర్పాటుచేయబోతున్నాం అని వివరించారు. మునుగోడు నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించబోతున్నానని కేఏ పాల్ కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో ఒక శాతం ఉన్న వారే రాష్ట్రాన్ని పాలించాలా? అని హాట్ కామెంట్స్ చేశారు.

 గెలిచి తీరతాం..

గెలిచి తీరతాం..


మునుగోడులో తమ పార్టీ పోటీ చేస్తుందని, గెలిచి తీరుతాం అని కేఏ పాల్ విశ్వాసంతో ఉన్నారు. మునుగోడులో గెలిచి తెలంగాణ ప్రజలకు చక్కటి పాలన అందజేస్తానని చెబుతున్నారు. తెలంగాణ అభివృద్ది ప్రజాశాంతి పార్టీతో సాధ్యం అవుతుందని చెప్పుకొచ్చారు. తమ పార్టీని మునుగోడు ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

 వరాల జల్లు

వరాల జల్లు


అంతేకాదు వరాలు కూడా కురిపించారు. మునుగోడు ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ గెలిస్తే ఆరు నెలల్లో 50 వేల ఉద్యోగాలు ఇస్తామని అంటున్నారు. ఉచిత విద్య కూడా అందిస్తామని పేర్కొన్నారు. మునుగోడులో ప్రతి గ్రామంలో తన చారిటీ ద్వారా ఉద్యోగాలు ఇస్తానని తెలిపారు. తమ పార్టీని గెలిపించాలని కోరారు.

ఓట్లు చీలుస్తారా..?

ఓట్లు చీలుస్తారా..?


మునుగోడులో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య పోటీ ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా రేసులో ఉండనుంది. సిట్టింగ్ స్థానం కాపాడుకోవాలని అనుకుంటోంది. అయితే ఇప్పడు కేఏ పాల్ కూడా వచ్చారు. ఆయన క్రిస్టియన్ ఓట్లను ఏమైనా చీల్చుతారా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఆ వర్గం వారు కూడా తమకే ఓటు వేస్తారని ప్రధాన పార్టీలు ధీమాతో ఉన్నాయి. కేఏ పాల్ పార్టీ గెలవకున్నా.. ఓట్లను ఎంతో కొంతో చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
ka paul assures to munugodu people if his party won the by poll. with in 6 months 50 thousand jobs will established
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X