నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

video:కేఏ పాల్ మాస్ డ్యాన్స్, ఈలలు వేస్తూ, అలర్లి చేస్తూ ఉత్సాహం, వైరల్

|
Google Oneindia TeluguNews

మునుగోడులో ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ట్రై చేస్తున్నారు. ప్రలోభాలకు గురిచేయడం ఖాయమే. స్టార్ క్యాంపెయినర్లు.. స్టార్స్ ప్రచారం కూడా ఉంటుంది. అగ్ర నేతలను రప్పిస్తున్నారు. ఉప ఎన్నిక బరిలో కేఏ పాల్ కూడా ఉన్నారు. ఆయన ఇండిపెండెంట్‌గా పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే డ్యాన్స్ చేస్తూ అక్కడ ఉన్న వారిలో హుషారు తీసుకొచ్చారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

 గద్దర్ కాదనడంతో..

గద్దర్ కాదనడంతో..


ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్ చివరి సమయంలో తప్పుకున్నారు. దీంతోకేఏ పాల్ బరిలో పోటీకి దిగారు. ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేకపోవడంతో మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అంతకుముందే జనాలతో పాల్ కలిసిపోయే వారు. ఇప్పుడు ఎన్నికల సమయం కావడంతో.. తాను గుర్తుండేలా చేస్తున్నారు. ఆయన సీరియస్‌గా చేసినా.. కామెడీ అనిపిస్తోంది. అలా ఆ వీడియోలు షేర్ చేయడంతో ట్రోల్ అవుతున్నాయి.

మాస్ డ్యాన్స్

మాస్ డ్యాన్స్


మునుగోడులో కేఏ పాల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఓటర్లను కలుస్తూ.. వస్తున్నారు. తన ట్రేడ్ మార్క్ విన్యాసాలు, మాస్ డ్యాన్సుతో జనంతో మమేకం అవుతున్నారు. ఓ ఫోక్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు. జనం చుట్టూ గుమికూడగా, ఏ మాత్రం బెరుకు లేకుండా స్టెప్పులు వేశారు. అక్కడ ఉన్నవారు పాల్‌ను మరింత ఎంకరేజ్ చేశారు. అరుస్తూ.. ఈలలు వేస్తూ డ్యాన్స్ చేసేలా పురిగొల్పారు.

మిఠాయి పంచి, కోమటిరెడ్డికి షేక్ హ్యాండ్

మిఠాయి పంచి, కోమటిరెడ్డికి షేక్ హ్యాండ్


దీపావళి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో కేఏ పాల్ ప్రచారం చేశారు. లోకల్‌గా ఉన్న ఓ సెలూన్ లో హెయిర్ కట్ చేయించుకున్నారు. ఓటర్లకు మిఠాయిలు, మంచినీళ్ల బాటిళ్లు పంచారు. ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేఏ పాల్ షేక్ హ్యాండ్ ఇచ్చారు. కోమటిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక జనం తికమక పడ్డారు.

ఓటు బ్యాంక్ కొల్లగొడుతారా..?

ఓటు బ్యాంక్ కొల్లగొడుతారా..?


ఇప్పుడే కాదు.. ఎప్పుడూ కేఏ పాల్ అంతే.. సరదాగా ఉంటారు. జనాన్ని నవ్వించే ప్రయత్నం చేస్తారు. సీరియస్‌గా కామెంట్లు చేసినా.. కామెడీ అనిపించేలా ఉంటుంది. ఉప ఎన్నికలో బరిలో ఉండి.. తెగ నవ్విస్తున్నారు. అయితే సీరియస్‌గా హామీలను కూడా ఇస్తున్నారు. బై పోల్‌లో గెలవకున్న.. కొన్ని ఓట్లను మాత్రం రాబట్టుకొనున్నారు. అదీ విజయంపై ప్రభావం చూపితే.. కేఏ పాల్ కష్టానికి ఫలితం దక్కినట్టే అవుతుంది.

English summary
prajashanti party chief ka paul steps at munugodu campaign. peopel are encourage to him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X