రూ.1.20 కోట్లు: 108 చ.అ స్థలం కొనుగోలు.. అరటిపండ్ల చిరు వ్యాపారి ధైర్యం..
అరటి పండ్లు విక్రయించే వ్యాపారి ఓ స్థలం కొన్నారు. ఆ స్థలం ఏకంగా రూ.1.2 కోట్లు ఉండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది. చిరు వ్యాపారి భారీ సొమ్ముతో స్థలం కొనడం స్థానికులు షాక్‌నకు గురయ్యారు. ఈ ఆశ్చర్యకర ఘటన నెల్లూరులో జరిగింది. మరో విశేషం ఏంటంటే అతను కొన్న ఆ స్థలం కేవలం 108 చదరపు అడుగులే కావడం విశేషం. ఈ స్థలాన్ని ఆయన ఏకంగా కోటి 20 లక్షల రూపాయలు పెట్టి మరీ కొనుగోలు చేశారు.

చిరు వ్యాపారి జిలాని..
నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెంలో ఎస్కే జిలాని అనే వ్యాపారి ఉన్నారు. కొన్నేళ్ల నుంచి అరటి పళ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ముంబయి జాతీయ రహదారికి ఆనుకుని బస్టాండ్ సెంటర్ సమీపంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏకంగా 40 ఏళ్లుగా తోపుడు బండిమీద అరటి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్యే అక్కడ పాత షాపులు పడగొట్టి, కొత్తగా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్వహకులు నిర్ణయించారు.

ఎక్కడ పంపిస్తారోనని..
జిలానికి తెలిసింది. అక్కడ వాణిజ్య సముదాయం కడితే తనను అక్కడి నుంచి పంపించేస్తారని భావించారు. దాంతో తన జీవనాధారం పోతుందని ఆందోళన చెందారు. ఆ కాంప్లెక్స్‌లో ఎంతో కొంత స్థలం కొనేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన వేలం పాటలో పాల్గొన్నారు. పాటలో 108 చదరపు అడుగుల స్థలానికి వేలం పాడాడు. ఏకంగా రూ.1.20 కోట్లకు వేలంపాట పాడి స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

శభాష్..
తన జీవనాధారం కోసం అరటిపండ్ల వ్యాపారి గొప్ప సాహసమే చేశారు. తనకు కావాల్సిన భూమి కోసం ఏకంగా కోటి పెట్టి మరీ కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారి ధైర్యం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఏకంగా కోటి వెచ్చించడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయ్యా బాబోయ్ చిరు వ్యాపారి అంటే ఇయనేరా అని డిస్కష్ చేస్తున్నారు.