నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హస్తమే నేస్తం: కాంగ్రెస్ గూటికి డీఎస్..? ఖరారు కానీ ముహూర్తం.. ఎంపీ పదవీ

|
Google Oneindia TeluguNews

ధర్మపురి శ్రీనివాస్.. డీఎస్, కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. కానీ ఎప్పుడూ.. సింగిల్‌గా... లేదంటే శ్రేణులు, కుమారుడు కూడా చేరుతాడా అనే అంశంపై స్పష్టత లేదు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో కాంగ్రెస్‌ పార్టీలో డీ శ్రీనివాస్‌ చేరిక త్వరలోనే ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీతో సమావేశమై.. తిరిగి పాత గూటిలోకి వెళ్లేందుకు అనుమతి తీసేసుకున్నారు. డీఎస్‌ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత డీఎస్‌ను పెద్దల సభకు పంపించిన సంగతి తెలిసిందే.

 దూరం.. దూరం...

దూరం.. దూరం...

కొన్ని పరిణామాలతో టీఆర్ఎస్‌కు దూరమయ్యారు. డీఎస్‌పై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్‌ జిల్లా అధికారపార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. డీఎస్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మళ్లీ చురుకైన పాత్ర కోసం చూస్తున్నారు ఆయన. టీఆర్ఎస్‌పై రాజకీయ విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌లోకి తిరిగి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న ఆయన.. రాజ్యసభ ఎంపీ పదవి విషయంలో ఏం చేస్తారనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎంపీగా ఆయన పదవీకాలం మరో ఆరు నెలలే ఉంది. ఎంపీగా పదవీకాలం పూర్తయ్యాక కాంగ్రెస్‌లో చేరితే వచ్చే విమర్శలు వేరలా ఉంటాయి. ఎలాగూ ఆరునెలలే పదవీకాలం ఉండటంతో ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరితే... రాజకీయంగా పైచెయ్యి సాధించవచ్చనే ఆలోచనలో డీఎస్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

 ధీటుగా కౌంటర్

ధీటుగా కౌంటర్

టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చే విమర్శలకు గట్టిగానే కౌంటర్‌ చేయొచ్చని అనుకుంటున్నారట. ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి వెళ్తే.. డీఎస్‌పై అనర్హత వేటు వేయాలని టీఆర్ఎస్ కోరే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో అనర్హత వేటు వేయించుకోవడం కంటే ఎంపీ పదవీకి రాజీనామా చేయడమే బెటర్‌ అని డీఎస్‌ సన్నిహిత వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఆ మధ్య సోనియాగాంధీతో డీఎస్‌ భేటీ తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్‌ ముఖ్యులకు ఢిల్లీ రావాలని హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చింది. తర్వాత ఏమైందో ఏమో.. ఆ ట్రిప్‌ క్యాన్సిల్‌ అయ్యింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్‌ చేరిక.. ఆ సందర్భంగా వచ్చే సాంకేతిక సమస్యలు చర్చించారో లేక.. మంచి తరుణం కోసం వేచి చూస్తున్నారో కానీ.. చేరిక ఎప్పుడున్నది సస్పెన్స్‌లో పెట్టారు.

 డీఎస్ గురించి చర్చ

డీఎస్ గురించి చర్చ

కాంగ్రెస్‌లో నేరుగా హైకమాండ్‌తో సంబంధాలు ఉన్న నేత కావడంతో డీఎస్‌పై పీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌లోకి డీఎస్‌ రీ ఎంట్రీ ఏ విధంగా ఉంటుందో.. టీఆర్ఎస్‌ నుంచి వెళ్తూ వెళ్తూ.. ఎవరిని కలవరపెడతారో చూడాలి మరీ.

English summary
senior leader ds will join congress party soon sources said. he will must resign mp post when he join the congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X