వంకాయతో కలిపి చికెన్.. 120 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
సిద్దిపేటలో ఓ విద్యా సంస్థలో ఫుడ్ పాయిజన్ జరిగింది. వంకాయ కర్రీతో చికెన్ వండినట్టు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో గల మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడంతో 120 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అయితే విషయాన్ని తెలియకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కొందురు విద్యార్థినుల పరిస్థితి విషమించడంతో వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆయన డాక్టర్లను ఆదేశించారు. ఆదివారం గురుకులంలో చికెన్ వండి వడ్డించారట. చికెన్‌తోపాటు వంకాయ కూర కలిపి వడ్డించారని తెలుస్తోంది. ఆహారం తిన్న తర్వాత విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం.

ఆదివారం రాత్రి నుంచి వారు కడుపు నొప్పితో బాధపడ్డారు. సోమవారం నాటికి కొందరిలో కడుపునొప్పి తీవ్రం కావడంతో అధికారులకు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వైద్య సిబ్బంది గురుకులానికి చేరుకొని అక్కడే చికిత్స అందించారు. కొందర్ని హాస్పిటల్‌కు తరలించారు. తెలంగాణ మైనారిటీ గురుకులాల సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి యూసఫ్ అలీ, జిల్లా విజిలెన్స్ అధికారి గౌస్ పాషా, మైనారిటీ గురుకులాల జిల్లా ఇన్‌ఛార్జి గోపాల్‌రావు.. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఘటనపై విచారణ చేపట్టారు.
స్వ రాష్ట్రంలో గురుకులాలు, మైనార్టీ విద్యా సంస్థలకు కళ వచ్చింది. మంచి విద్య, నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా తర్వాత పరిస్థితి మారిపోయింది. అందుకు ఈ ఘటన సజీవ సాక్ష్యం.. ఇంతకుముందు కూడా పలు ఘటనలు జరిగాయి.