వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసిఫాబాద్ జిల్లాలో 15మంది గురుకుల పాఠశాల విద్యార్థినులకు అస్వస్థత.. రీజన్ అదేనా?

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలలో పరిస్థితులు మారడం లేదు. విద్యార్థుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యమో, పర్యవేక్షణ లోపమో సంక్షేమ పాఠశాలలో చదువుకుంటున్న బాలబాలికలు అస్వస్థతకు గురి అవుతూ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల కస్తూర్బా గురుకులంలో 15మందికి అస్వస్థత

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల కస్తూర్బా గురుకులంలో 15మందికి అస్వస్థత

మొన్నటికి మొన్న వర్ధన్నపేట సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో బల్లి పడిన ఆహారం తిని 33 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటన మరిచిపోకముందే తాజాగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయంలో శుక్రవారం నాడు 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

ఆస్పత్రికి తరలించి చికిత్స .. పరీక్షకు విద్యార్థినుల రక్త నమూనాలు

ఆస్పత్రికి తరలించి చికిత్స .. పరీక్షకు విద్యార్థినుల రక్త నమూనాలు

నీరసం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థినులను పాఠశాల సిబ్బంది చికిత్స కోసం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అంబులెన్స్ లో తరలించారు. విద్యార్థులకు చికిత్స చేసిన అనంతరం మళ్లీ అందరు విద్యార్థులను కస్తూర్బా విద్యాలయానికి తీసుకువచ్చారు.

విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని బట్టి కొందరికి ఇంజక్షన్లు చేశామని, మరికొందరికి సెలైన్లు పెట్టామని, వారందరినీ రక్తనమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం పంపించామని, ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కౌటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు తెలిపారు.

ఇక వారు ఏ కారణంతో అస్వస్థతకు గురయ్యారు అన్నది తెలియరాలేదు. ఇటీవల వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న నేపధ్యంలో ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందా అన్న అనుమానం స్థానికంగా వ్యక్తం అవుతుంది.

గురుకులాలలో తరచూ విద్యార్థుల అస్వస్థత ఘటనలు

గురుకులాలలో తరచూ విద్యార్థుల అస్వస్థత ఘటనలు


గురుకులపాఠశాలలోనూ, సాంఘిక సంక్షేమ వసతి గృహాలలోను తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంపై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, విద్యార్థులకు వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఆకస్మిక తనిఖీలు చేస్తున్న కలెక్టర్లు.. ప్రభుత్వం కూడా సీరియస్ గానే చర్యలు

ఆకస్మిక తనిఖీలు చేస్తున్న కలెక్టర్లు.. ప్రభుత్వం కూడా సీరియస్ గానే చర్యలు

ఇక ఇప్పటికే అనేక జిల్లాలలో కలెక్టర్లు హాస్టల్స్ , వసతి గృహాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ హాస్టల్స్ లో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇక హాస్టల్స్ పై పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. అయినప్పటికీ రోజుకొక హాస్టల్లో విద్యార్థులు వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తుంది. వారు తీసుకుంటున్న ఆహారం, త్రాగునీరు లోపమా? లేకా సీజనల్ వ్యాధులతో విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే చాలా హాస్టల్స్ లో ఆహారమే సమస్య అని విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది.

English summary
In Asifabad district, 15 girls from kasturba gurukul School were sick with vomiting and diarrhoea.school staff taken the students to a local hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X