Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లొట్టలేసుకుంటూ ఉస్మానియా బిస్కెట్ తింటున్నారా- జరా సోచాయించుండ్రి

ఉస్మానియా బిస్కెట్. హైదరాబాద్ లో దీని రుచి గురించి తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ బిస్కట్ తీపి, ఉప్పు రుచుల అద్భుతమైన సమ్మేళనం. హైదరాబాద్ సంస్కృతిలో తనదైన ముద్ర వేసింది. ఇరానీ చాయ్- ఉస్మానియా బిస్కెట్ కాంబినేషన్ అదుర్స్. నిజాం పాలన నుంచీ హైదరాబాద్ తో విడదీయరాని అనుబంధం ఉంది ఈ ఉస్మానియా బిస్కెట్ కు. టర్కిష్, పర్షియన్ వంట పద్ధతుల ప్రభావం దీనిపై అధికంగా ఉంటుంది.

అటువంటి ఐకానిక్ ఉస్మానియా బిస్కట్లకు ప్రస్తుతం నకిలీల ముప్పు పొంచి ఉంది. హైదరాబాద్ లో విచ్చలవిడిగా కల్తీ ఉస్మానియా బిస్కెట్లు తయారవుతున్నాయి. ఏ మాత్రం హైజెనిక్ కానివి అవి. నాణ్యత రహితంగా, కల్తీ ఆహార పదార్థాలతో ఈ బిస్కెట్లను బేక్ చేస్తోంది. దాదాపుగా అన్ని చిన్నా, చితకా దుకాణాలను వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటోంది. ఈ ముఠా గుట్టు తాజాగా రట్టయింది. కల్తీ ఉస్మానియా బిస్కెట్లతో పాటు నమ్కీన్, చిక్లీ, మిక్చర్ వెలుగులోకి వచ్చింది.

Adulterated Osmania Biscuits Namkeen and Rusk Found in Unhygienic Conditions in Hyderabad by Police

కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తోన్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు మైలార్‌దేవ్‌పల్లి, గుడిమల్కాపూర్‌లలో ఉన్న కొన్ని అక్రమ ఆహార, బేకరీ యూనిట్లపై దాడులు జరిపారు. ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. నలుగురిని అరెస్టు చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, నమ్‌కీన్, మిక్చర్, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. నగరవ్యాప్తంగా పంపిణీకి సిద్ధంగా ఉంచిన, ప్రజారోగ్యానికి తీవ్ర హానికరం అయిన 99 కార్టన్ల సరుకు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కల్తీ ఆహార పదార్థాల తయారీ, విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై బీఎన్ఎస్ లోని క్రిమినల్ నంబర్లు 282, 283, 284/2026 యూ/ఎస్ 318(4), 274 కింద వారిపై కేసులు నమోదయ్యాయి. హెచ్- ఫాస్ట్ బృందంతో పోలీసులు దాడులు నిర్వహించారు. బాబుల్ రెడ్డి నగర్, లక్ష్మీగూడ ప్రాంతాల్లో మెరుపుదాడులు జరిపారు.

అక్కడ నిందితులు అరుణ్ కుమార్, అంజని, జైన్ ఫుడ్స్ పేరుతో, ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకుండా, హానికర రసాయనాలతో మిక్చర్, నమ్‌కీన్, చిక్కీలు, ఉస్మానియా బిస్కెట్లను తయారుచేసి స్థానిక మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మున్నీర్, అరుణ్ కుమార్, వీ మస్థాన్ రెడ్డి, విశాల్ జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి రూ. 3,35,100 విలువైన కల్తీ ఆహార పదార్థాలు, ముడిసరుకు, రసాయనాలు, ఆహార రంగులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+