వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బిజెపి మూల్యం చెల్లించుకొంటుంది', 'మాది భార్యభర్తల బంధం'

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:కేంద్ర బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేసిన ఎన్డీఏ ప్రభుత్వం తమ పద్దతిని మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం కె.ఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా పోరాటం ఫలించింది:సీఎం రమేష్, రాజ్యసభ వాయిదా తర్వాత ఏం జరిగిందంటే?మా పోరాటం ఫలించింది:సీఎం రమేష్, రాజ్యసభ వాయిదా తర్వాత ఏం జరిగిందంటే?

ఏపీ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు విషయంలో సానుకూల సంకేతాల కోసం ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు

శుభవార్త: ఎంపీల నిరసనలతో దిగొచ్చిన కేంద్రం, లోటు భర్తీకి సిద్దంశుభవార్త: ఎంపీల నిరసనలతో దిగొచ్చిన కేంద్రం, లోటు భర్తీకి సిద్దం

మొండిచేయి,ఇక తాడోపేడో: టిడిపి, జైట్లీ ప్రకటనపై బాబు అసంతృప్తిమొండిచేయి,ఇక తాడోపేడో: టిడిపి, జైట్లీ ప్రకటనపై బాబు అసంతృప్తి

కేంద్ర ప్రభుత్వం నుండి ఆశించిన రీతిలో ప్రకటన వస్తోందని ఏపీకి చెందిన టిడిపి నేతలు ఆశతో ఉన్నారు. ఒకవేళ కేంద్రం నుండి ఆశించిన రీతిలో ప్రకటన రాకపోతే ఏం చేయాలనే దానిపై కూడ టిడిపి నేతలు ఆలోచన చేస్తున్నారు.

కేంద్రం మూల్యం చెల్లించుకొంటుంది

కేంద్రం మూల్యం చెల్లించుకొంటుంది

కేంద్ర బడ్జెట్లో ఏపీ రాష్ట్రానిక అరకొర నిధుల కేటాయింపుపై ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్రం తన తీరును మార్చుకోకపోతే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.కేంద్ర ప్రభుత్వం తన తప్పును సరిదిద్దుకొంటుందని కెఈ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు.

గల్లా జయదేవ్‌పై కెఈ ప్రశంసలు

గల్లా జయదేవ్‌పై కెఈ ప్రశంసలు

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ గల్లా జయదేవ్‌ను అభినందిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి తెలిపారు. అప్పట్లో తలుపులు మూసి కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేస్తే, ఇప్పుడు బీజేపీ తలుపు తెరచి అన్యాయం చేస్తోందని విమర్శించారు.

భార్య,భర్తల బంధం

భార్య,భర్తల బంధం


టీడీపీ, బీజేపీలది భార్యభర్తల బంధమని మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం ఉమర్ ఆలీషా సభల్లో పాల్గొన్న అనంతరం మంత్రి మాణిక్యాలరావు మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.ఏపీకి కేంద్రం నుండి భారీగానే నిధులు ఇచ్చినట్టు మాణిక్యాలరావు చెప్పారు.

అపార్ధాలు తొలగిపోతాయి

అపార్ధాలు తొలగిపోతాయి

కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కల్లో స్పష్టత లేదు కానీ..ఏపీకి మాత్రం భారీగా నిధులు ఇచ్చిందని ఏపీ మంత్రి మాణిక్యాలరావు గుర్తు చేశారు. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న తపనతో కేంద్రాన్ని సీఎం మరిన్ని నిధులు అడుగుతున్నారని మంత్రి చెప్పారు. ఇరు పార్టీల మధ్య అపార్థాలు త్వరలోనే తొలిగిపోతాయన్నారు.

English summary
Ap deputy cm K.E. Krishnamurthy sensational comments on NDA government on Friday in East Godavari district. He demanded that NDA government fulfill its promises to AP state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X