బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్.. అధిష్టానం ఆదేశం వెనుక..!!
తెలంగాణ రాష్ట్రంలో దూకుడుగా బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను పూర్తి చేసి వెంటనే ఆరో విడత పాదయాత్రను కొనసాగించాలని భావించారు. అయితే ఆరో విడత బండి సంజయ్ పాదయాత్రకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్రకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నప్పటికీ, ప్రస్తుతానికి బ్రేక్ ఇచ్చి తాము చెప్పే కొన్ని పనులపై దృష్టి సారించాలని అధిష్టానం బండి సంజయ్ ఆదేశించినట్లు గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే బండి సంజయ్ సంక్రాంతి లోపే పాదయాత్రను పూర్తి చేయాలని భావించిన, పాదయాత్రను కొనసాగించ లేని పరిస్థితి వచ్చింది.

బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ వేసిన అధిష్టానం
సంక్రాంతి వరకు పాదయాత్రను పూర్తి చేసి సంక్రాంతి తర్వాత బస్సు యాత్ర చేపడతారని పార్టీ నేతలు భావించారు. సంక్రాంతికి ముందే ఆరో విడత పాదయాత్రలో భాగంగా పది రోజుల పాటు బండి సంజయ్ పాదయాత్ర చేస్తారని ఐదో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇదే విషయాన్ని బండి సంజయ్ ప్రకటిస్తారని కూడా పార్టీ నేతలు చెప్పారు. అయితే బండి సంజయ్ ఆ ప్రకటన చెయ్యలేదు. దీనికి కారణం అధిష్టానం బండి సంజయ్ పాదయాత్ర కు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్టుగా సమాచారం.

సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీలపై ఫోకస్ పెట్టమన్న అధిష్టానం
ప్రస్తుతం పాదయాత్రలు అన్ని పక్కనపెట్టి పార్టీ సంస్థాగత నిర్మాణం పై దృష్టి పెట్టాలని బండి సంజయ్ ను ఆదేశించిన క్రమంలోనే ఆయన పాదయాత్రకు బ్రేక్ పడ్డట్టుగా తెలుస్తుంది. మండలాల వారీగా బూత్ కమిటీల సమ్మేళనం ఏర్పాటు చేయాలని, జనవరి మొదటి వారంలోగా పూర్తి చేయాలని అధిష్టానం బండి సంజయ్ ను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని భావిస్తున్న బిజెపి అధిష్టానం అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో పని చెయ్యాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఆదేశించింది.

బూత్ కమిటీల తో అసెంబ్లీ సదస్సులు.. వర్చువల్ గా మాట్లాడనున్న జేపీ నడ్డా
జనవరి 7వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల లో బూత్ కమిటీల తో అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఇప్పటి నుంచే బూత్ కమిటీల సమ్మేళనానికి ఏర్పాట్లు చేయాలని సూచించింది. బూత్ కమిటీలతో నిర్వహించే అసెంబ్లీ సదస్సులలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ గా ప్రసంగిస్తారు.

రేపటి నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్ లో కీలక సమావేశాలు
ఇక ఇదే సమయంలో డిసెంబర్ 28, 29, 30 తేదీలలో దక్షిణాది రాష్ట్రాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం, తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశం హైదరాబాద్లో జరగనుంది. అంతేకాదు సంక్రాంతి తర్వాత బండి సంజయ్ అసెంబ్లీ ల వారీగా పర్యటించాలని రోజూ మూడు అసెంబ్లీల చొప్పున సంస్థాగత అంశాలపై సమీక్ష చేయాలని, బూత్ కమిటీలను నేరుగా కలిసి మాట్లాడాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కూడా ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్ర దాదాపు ఒక నెల రోజుల పాటు నిర్వహించే అవకాశం లేదని భావిస్తున్నారు.

బండి సంజయ్ ఆరవ విడతకు బ్రేక్
ఈ క్రమంలోనే బండి సంజయ్ ఆరవ విడత పాదయాత్రకు కాస్త టైం పడుతుందని భావిస్తున్నారు. ఏదిఏమైనా అధిష్టానం పాదయాత్ర లో వచ్చిన జనం మద్దతు ను చూసి, అదే ఓటు బ్యాంకు అని భ్రమపడి నేల విడిచి సాము చేయొద్దని బండి సంజయ్ కు సూచించినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చెయ్యటానికి దృష్టి పెట్టాలని సూచించిన క్రమంలోనే బండి సంజయ్ పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ వేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
-
ఆశలు ఆవిరి చేస్తోన్న బంగారం ధరలు -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
అనసూయకు అవమానం..? వీడియో -
డిగ్రీలెందుకు దండగ.. గాడిదలు ఉంటే పండగ! -
షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు -
వధువు కంటే వదినే హైలైట్.. ఆ రాయల్ లుక్ మామూలుగా లేదుగా! -
విజయ్ దేవరకొండ నివాసానికి సీఎం రేవంత్.. కొత్తజంటకు స్పెషల్ విషెస్.. -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
ఓటీటీలోకి 'పూకీ' మూవీ.. ఇక రచ్చ రచ్చే..! -
ఏపీలో వాహనదారులకు భారీ షాక్-అసెంబ్లీలో బిల్లు..!












Click it and Unblock the Notifications