వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ విచారణకు కేసీఆర్ సిద్దమా..? : భట్టి, నోరు అదుపులో పెట్టుకో.. : విప్ ఓదెలు

|
Google Oneindia TeluguNews

ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని గతంలో ఆరోపించినట్టుగానే, దుమ్ముగూడెం ప్రాజెక్టు, మిషన్ భగీరథల్లో అవినీతి చోటు చేసుకుంటుందన్న వ్యాఖ్యలు చేస్తూ.. వాటిపై
సీబీఐ దర్యాప్తుకు సీఎం కేసీఆర్ సిద్దమేనా..? అని సవాల్ విసిరారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ హయాంలో మధిరలో నిర్మించిన ప్రాజెక్టులపై కూడా సీబీఐ విచారణ చేయించేందుకు సిద్దంగా ఉన్నారా..? అని సీఎం కేసీఆర్ ని సూటిగా ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపితే కాంగ్రెస్, టీఆర్ఎస్ లలో ఏ పార్టీ అవినీతికి పాల్పడింది తెలుస్తుందన్న తరహాలో కామెంట్స్ చేశారు భట్టి. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్ని చిత్తశుధ్దితో నిర్మించామని చెప్పారు.

ఇక పార్టీ మారిన నేతల గురించి స్పందిస్తూ.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పువ్వాడ అజయ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి నేతలు టీఆర్ఎస్ తీర్థం పుచుకున్నారని ఆరోపించారు.

bhatti vikramarka challenge to kcr about cbi enquiry

అవినీతిపై పేటెంట్ హక్కు కాంగ్రెస్ దే : విప్ ఓదెలు

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క అవినీతి గురించి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

పాలేరు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కి జనం బుద్ది చెప్పినప్పటికీ, ఇంకా ఆ పార్టీ నాయకుల్లో మార్పు రావట్లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులను మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తులుగా అభివర్ణించిన విప్ నల్లాల ఓదెలు.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ వి అనవసరమైన ఆరోపణలన్నారు.

అవినీతికి సంబంధించి పేటెంట్ హక్కులన్నీ కాంగ్రెస్ వే అని ఎద్దేవా చేసిన
ఆయన, ప్రభుత్వం గురించి మాట్లాడేప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని భట్టిని హెచ్చరించారు. గతంలో 'ఇందిరమ్మ ఇళ్ల' పథకాన్ని అవినీతిమయంగా మార్చిన ఘనత అప్పటి మంత్రి, ప్రస్తుత టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు.

English summary
Congress working president Mallu Bhatti Vikramarka challenged cm kcr about cbi enquiry to enquire on dummugudem project and mission bhageeraatha
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X