హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ఉండే వారికి బిగ్ అలెర్ట్..!
హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. నేడు ( డిసెంబర్ 2, 2025.. మంగళవారం ) పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం చోటు చేసుకోనుంది. నిర్వహణ, మరమ్మతు పనుల కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అనంతరం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల్లో విద్యుత్ నిలిపివేయనున్నారు. పనులు ముందుగానే పూర్తైతే షెడ్యూల్‌కు ముందుగానే సరఫరా పునరుద్ధరిస్తామని కూడా స్పష్టం చేశారు.
కాగా బంజారాహిల్స్ ఏడీఈ జి. గోపీ వివరాల ప్రకారం.. ఉదయం 10-1 గంటల మధ్య 11కేవీ స్టేట్ హోమ్, నాందారి టెంట్ హౌస్ ఫీడర్లకు విద్యుత్ ఉండదన్నారు. అలాగే మధ్యాహ్నం 2-5 గంటల మధ్య 11కేవీ ఎల్లారెడ్డిగూడ, బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రి ఫీడర్ల పరిధిలో సరఫరా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతాల్లో ముందస్తుగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరోవైపు గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ ఎల్.వి. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉదయం 10-1 గంటల మధ్య 11కేవీ జయప్రకాష్ నగర్, పీలి దర్గా, అవంతి నగర్ ఫీడర్లలో మరమ్మతుల కోసం సరఫరా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మధ్యాహ్నం 2-5 గంటల వరకు 11కేవీ కార్మిక నగర్ ఫీడర్ పరిధి కూడా ప్రభావితం కానుంది. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్‌ను యథావిధిగా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే అధికారులు ప్రజలకు కొన్ని సూచనలు కూడా జారీ చేశారు. ముఖ్యంగా హోం అప్లయెన్సెస్‌ను ఆఫ్‌లో ఉంచడం, ఇన్వర్టర్లు, ఛార్జింగ్ పరికరాలను ముందస్తుగా సిద్ధం చేసుకోవడం, అత్యవసర అవసరాలకు తగినట్లుగా నీటి నిల్వలు చేసుకోవడం మంచిదని తెలిపారు. విద్యుత్ నిలిపివేత కారణంగా హాస్పిటల్స్, వ్యాపార సంస్థలు, చిన్న పనిదారులు తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని.. అందుకు తగ్గ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు.
ఈ షెడ్యూల్ నగరంలోని ముఖ్యమైన రోడ్లు, కాలనీలు, వాణిజ్య ప్రాంతాలను ప్రభావితం చేయనున్నప్పటికీ.. భవిష్యత్తులో సేవల నాణ్యతను మెరుగుపర్చడానికి ఇవి అవసరమైన చర్యలేనని అధికారులు పేర్కొన్నారు.
-
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications