హైదరాబాద్ - విజయవాడ హైవేకు మహార్దశ.. 60 అండర్ పాస్ బ్రిడ్జ్ లు..
హైదరాబాద్- విజయవాడ హైవేపై నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధాన వారధిగా ఈ ఎన్ హెచ్ 65 ఉంది. అయితే ఈ రహదారిపై రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ హైవేపై రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 60 అండర్ పాస్ వంతెనల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. హైవేను దాటే టూ వీలర్స్ అలాగే పాదచారులు రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా జంక్షన్ వద్ద ఈ అండర్ పాస్ బ్రిడ్జిని నిర్మించాలని ఎన్ హెచ్ ఏఐ భావిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రధాన వారధిగా ఉన్న ఎన్ హెచ్ 65 పై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్న క్రమంలో NHAI కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు మొత్తం దాదాపు 231 కిలోమీటర్ల విస్తరణ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఐకాన్స్ సంస్థ సిద్ధం చేసి తాజాగా సమర్పించింది. ఈ రహదారిపై దాదాపు 60 ప్రాంతాల్లో అండర్ పాస్ బ్రిడ్జ్ లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ డీపీఆర్ లో పేర్కొన్న విధంగా యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని విజయవాడలో కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ వరకు అంటే దాదాపు 231.32 కిలోమీటర్లు 6 వరుసల హైవేను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 60 ప్రాంతాల్లో అండర్‌పాస్ బ్రిడ్జ్ లను నిర్మించనున్నారు. ఈ 60 అండర్ పాస్ బ్రిడ్జ్ లను ప్రతీ 2 నుంచి 3 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేసేందుకు ఎన్ హెచ్ ఏఐ సిద్ధం అవుతోంది. దాంతోపాటు 17 వెహిక్యూలర్ అండర్ పాస్ లు , 35 లైట్ వెహిక్యులర్ అండర్ పాస్ లు.. అలాగే మరో 8 చిన్న అండర్ పాస్ లు, దాంతోపాటుగా 10 ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు కూడా నిర్మితం కానున్నట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్‌లో మాజీ సీఎం ఆస్తి సీజ్.. గంటల్లోనే విముక్తి! అసలేం జరిగింది? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
తెలుగు రాష్ట్రాల్లో ఈ టోల్ ప్లాజాల్లో ఫీజుల తగ్గింపు - కొత్త ధరలు, వీటికే వర్తింపు..!! -
Vijayawada: విజయవాడలో నాన్ వెజ్ బంద్-ఇవాళ రాత్రి నుంచే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ!












Click it and Unblock the Notifications