వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మునుగోడులో ఓడినా.. దూకుడుగా బీజేపీ; శిక్షణా తరగతులతో భవిష్యత్ ఎన్నికల ప్రణాళికలు.. తగ్గేదేలే!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రావడంతో బిజెపి రాష్ట్రంలో దారుణంగా దెబ్బతింటుందని దీని ప్రభావం భవిష్యత్తు ఎన్నికల పైన ఉంటుందని భావించిన వారికి అబ్బే అదేం లేదని చెప్పే ప్రయత్నం చేస్తుంది బిజెపి. మునుగోడు ఉప ఎన్నిక ఓటమి తర్వాత కూడా రెట్టించిన ఉత్సాహంతో బి.జె.పి ముందుకు దూసుకు వెళుతోంది.

వచ్చే ఎన్నికలకు కార్యాచరణ మొదలుపెట్టిన బీజేపీ

వచ్చే ఎన్నికలకు కార్యాచరణ మొదలుపెట్టిన బీజేపీ


త్వరలో ఐదో విడత బండి సంజయ్ పాదయాత్రను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఇక అంతే కాదు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు, సుశిక్షితులైన బీజేపీ సైన్యంతో వచ్చే ఎన్నికల రంగంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని బిజెపి ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి నుండే బిజెపి ఎన్నికల ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బీజేపీ నాయకత్వం ముందుకు వెళుతుంది.

బీజేపీ రాష్ట్ర నేతలకు మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు

బీజేపీ రాష్ట్ర నేతలకు మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు

తెలంగాణ రాష్ట్రం పై బిజెపి అగ్రనేతలు ప్రధానంగా ఫోకస్ చేస్తున్న క్రమంలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 20, 21, 23 తేదీలలో శిక్షణా తరగతులను రాష్ట్ర బిజెపి నేతలకు నిర్వహించనున్నారు. హైదరాబాద్ అన్నోజిగూడ ఆర్ వి కే లో శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణా తరగతులలో రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు శిక్షణ ఇస్తారు.

రాష్ట్రనేతలకు శిక్షణా తరగతులలో చెప్పేవి ఇవే

రాష్ట్రనేతలకు శిక్షణా తరగతులలో చెప్పేవి ఇవే

ఒక్కో జాతీయ నేత సుమారు 40 నుండి 50 నిమిషాలపాటు క్లాసులు తీసుకుని ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్లాలి? పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? పార్టీ సంస్థాగత నిర్మాణం, సిద్ధాంతాలు ఏమిటి? సాధించవలసిన లక్ష్యాలు ఏమిటి? గుర్తుపెట్టుకోవాల్సిన రాజకీయ అంశాలు ఏమిటి? వంటి అనేక విషయాలపై వీరికి అవగాహన కల్పించనున్నారు. మూడు రోజుల పాటు శిక్షణ ప్రాంగణంలోనే రాష్ట్ర నాయకత్వం బస చేసేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ.. జోష్ తో బీజేపీ భవిష్యత్ ఎన్నికల వ్యూహం

ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ.. జోష్ తో బీజేపీ భవిష్యత్ ఎన్నికల వ్యూహం


ఇక ఈ శిక్షణ తరగతులకు బిజెపి జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ లతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులకు శిక్షణ ఇవ్వడానికి వచ్చే జాతీయ నాయకులు కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు ఏర్పాట్లపై దృష్టిసారించిన బండి సంజయ్ పలువురు పార్టీ ముఖ్య నాయకులతో చర్చించారు. ఈ శిక్షణ తరగతులు అనంతరం నవంబర్ చివరిలో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రను కూడా ప్రారంభించనున్నారు. ఏది ఏమైనా మునుగోడు ఉపఎన్నికతో డీలా పడిపోతుంది అనుకున్న బిజెపి, అలాకాకుండా రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్ ఎన్నికల కోసం పనిచేయడం ప్రధానంగా కనిపిస్తుంది.

English summary
BJP is aggressive even if it loses in munugode. Future election plans with state leaders training classes with national leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X