హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలోను నిర్వహించాం: గ్లోబల్ సదస్సుకు బ్రాహ్మణి, చెర్రీ సతీమణి ఉపాసన

హెచ్ఐసీసీలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణి హాజరు కానున్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Global Entrepreneurship Summit : Ivanka Trump reached HICC, Video

హైదరాబాద్: హెచ్ఐసీసీలో జరగనున్న గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణి హాజరు కానున్నారు. ఆమెతో పాటు నటుడు రామ్ చరణ్ సతీమణి హాజరవనున్నారు. బ్రాహ్మణి, ఉపాసనలు కలిసి మంగళవారం మధ్యాహ్నం హెచ్ఐసిసి వేదికకు చేరుకున్నారు.

గ్లోబల్ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు వచ్చిన బ్రాహ్మణి మాట్లాడుతూ... ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక రంగానికి మరింత ఉపయుక్తకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సు వేదికగా యువత తమలోని ఆలోచనలను పంచుకోవచ్చునని వెల్లడించారు.

వారికి అపూర్వ అవకాశాలు

వారికి అపూర్వ అవకాశాలు

ఈ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అపూర్వ అవకాశాలు మరింత దగ్గర కానున్నాయని బ్రాహ్మణి అన్నారు. ఎన్నో ప్యానల్ డిస్కషన్స్‌లలో ఔత్సాహిక వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు ఆస్కారం ఉందని చెప్పారు. ఈ చర్చల ద్వారా వారు మరిన్ని విషయాలు తెలుసుకొని, ఉన్నతస్థితికి చేరుకోవచ్చునన్నారు.

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో భోజనం ఖరీదు రూ.18 వేలు: ఈ హోటల్ అద్భతాలు ఎన్నోఫలక్‌నుమా ప్యాలెస్‌లో భోజనం ఖరీదు రూ.18 వేలు: ఈ హోటల్ అద్భతాలు ఎన్నో

హైదరాబాదులో సదస్సు ఆనందం

హైదరాబాదులో సదస్సు ఆనందం

హైదరాబాద్ ఈ సదస్సుకు వేదిక కావడం తనకు ఆనందాన్ని ఇస్తోందని బ్రాహ్మణి అన్నారు. సదస్సు ఎక్కడ జరుగుతుందన్నది కూడా ముఖ్యం కాదన్నారు. గత సంవత్సరం ఏపీలో అతిపెద్ద మహిళా సదస్సును విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.

ఇవాంకా, మోడీల కోసం ఆ రోడ్లు మొత్తం ఖాళీ, 45 ని.ల్లో వెళ్లేలా ప్లాన్: పోలీసులకు సవాల్ఇవాంకా, మోడీల కోసం ఆ రోడ్లు మొత్తం ఖాళీ, 45 ని.ల్లో వెళ్లేలా ప్లాన్: పోలీసులకు సవాల్

మహిళలదే ప్రధాన పాత్ర

మహిళలదే ప్రధాన పాత్ర

మహిళల్లో వ్యాపారవేత్తలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని బ్రాహ్మణి అభిప్రాయపడ్డారు. తను వెంచర్ కాపిటలిస్టుగా ఉన్నానని, ఎన్నో కంపెనీలకు నిధులు అందిస్తున్నానని చెప్పారు. అన్నింటిల్లోను మహిళదే ప్రధానపాత్ర అన్నారు.

ఇవాంకాతో కలిసి వేదికపై కేటీఆర్: రామ్ చరణ్, సానియాల ప్రసంగంఇవాంకాతో కలిసి వేదికపై కేటీఆర్: రామ్ చరణ్, సానియాల ప్రసంగం

బ్రాహ్మణితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం

బ్రాహ్మణితో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం

అదే స్థానాన్ని వ్యాపారంలోను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బ్రాహ్మణి చెప్పారు. మహిళలకు ప్రోత్సాహాన్ని ఇస్తే వారు ఎంతో సాధిస్తారని చెప్పారు. హెచ్ఐసీసీ వద్ద బ్రాహ్మణిని చూసిన వివిధ రాష్ట్రాల మహిళా పారిశ్రామికవేత్తలు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం కనబరిచారు.

English summary
AP CM Nara Chandrababu Naidu's daughter in law Brahmani and Ram charan's wife Upasana at HICC for Ivanka's event.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X