ఝాన్సీ కేసు మరో మలుపు: ప్రియుడి సాక్ష్యమే కీలకం, తల్లి, భర్త కలిసి చంపేశారు
గొండ : నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోముల గ్రామంలో మరణించిన బిటెక్ విద్యార్థిని ఝాన్సీ మృతి కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారు. అయితే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కన్న తల్లి పద్మ, భర్త విజయేందర్‌రెడ్డి కలిసి అన్నంలో పురుగుల మందు కలిపి చంపేశారని తేలింది. హత్య చేసిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఝాన్సీ మృతదేహాన్ని భర్త స్వగ్రామం దీపగుంటకు తీసుకుచ్చినట్లు చెబుతున్నారు. ఝాన్నీ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై విచారించిన పోలీసులు అసలు నిజాన్ని బయటపెట్టారు.
తన మరణానికి ముందు ఝాన్సీ రాసిన లేఖ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు సాగించి గుట్టు లాగారు. ఝాన్సీ మరణించిన తర్వాత తల్లి, భర్త ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. ఝాన్సీ పుట్టింట్లో చనిపోతే అత్తగారింటికి తీసుకెళ్లి హడావిడిగా దహన క్రియలు పూర్తి చేశారు. ఇది పోలీసుల అనుమానాలను మరింత బలపడేలా చేసింది. తల్లి, భర్తే బలవంతంగా పురుగుల మందు తాగించి ఆత్మహత్యగా నాటకమాడారా అనే కోణంలో దర్యాప్తు చేశారు.

మంగళవారం నకిరేకల్ సీఐ వెంకటేశ్వరరావు, తహశీల్దార్ అంబేద్కర్ ఝాన్సీ అంత్యక్రియలు చేసిన స్థలాన్ని పరిశీలించి ఎముకలను సేకరించారు. బంధువుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ఝాన్సీ చదివిన ఇంజనీరింగ్ కాలేజీకి పోలీసు ప్రత్యేక బృందం వెళ్లి వివరాలు సేకరించింది. కాలేజీలో సాయిరామ్ అనే యువకుడితో ఝాన్సీ ప్రేమలో పడిందని తల్లి ఆరోపించింది. ఈ ఆరోపణలపై కూడా పోలీసులు విచారించారు. ఝాన్సీ కాల్‌డేటా ఆధారంగా సాయిరామ్‌ను విచారించారు.
విజయేందర్‌రెడ్డి తనను చాలాసార్లు బెదిరించాడని పోలీసులకు సాయిరామ్ తెలిపాడు. విజయేందర్‌రెడ్డి బెదిరింపు కాల్స్‌ను రికార్డు చేశారు. వీటన్నింటినీ పోలీసులకు అందజేశాడు. చివరకు సాయిరామ్ ఇచ్చిన ఆధారాలే ఈ కేసులో కీలకంగా మారినట్లు సమాచారం. మొన్ననే ఝాన్సీ తల్లి, భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించి వివరాలు రాబట్టారు. ఝాన్సీని కన్నతల్లి, కట్టుకున్న భర్త కలిసి హత్య చేశారని నిర్ధారించారు.
హైదరాబాద్‌లోని మాతృశ్రీ కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదివే ఝాన్సీ మే23న పరీక్షలు ముగియడంతో తన ఇంటికి వచ్చింది. అప్పుడే తల్లి, భర్తతో ఝాన్సీకి గొడవైంది. అప్పడే తన బాధలను వివరిస్తూ నకరేకల్ పోలీస్‌స్టేషన్‌కు ఝాన్సీ లేఖ రాసింది. ఆ లేఖ అందిన వెంటనే నకరేకల్ సీఐ ఝాన్సీ ఇంటికి వెళ్లగా ఝాన్సీ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని ఆమె సోదరుడు చెప్పాడు. ఆమె చనిపోయిన సమాచారాన్ని తల్లి రహస్యంగా ఉంచింది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications