తెలంగాణ ఆర్టీసీ టూర్ ప్లాన్.. కేవలం రూ. 3 వేలకే 1 నైట్, 2 డేస్ ప్యాకేజీ..
సంక్రాంతి సెలవులు పూర్తయిన వారం రోజులకే మరోసారి సెలవులు రానున్నాయి. ఈ వీకెండ్ లో వరుసగా మూడు రోజులు హాలీడేస్ వస్తున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిసి తిరిగి ఆఫీస్ బాట పట్టిన పెద్దలు, స్కూళ్లకు వెళుతున్న పిల్లలు, రెగ్యూలర్ వంటింటి పనుల్లో మునిగిన గృహిణులు ఈ సెలవుల్లో హాయిగా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఈ సెలవులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీ అద్భుతమైన టూర్ ప్లాన్ ను తీసుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే బ్యాగ్ సర్దుకుని పుణ్యక్షేత్రాల బాట పట్టండి.
వరుస సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు పూర్తయి జనవరి 19 నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే మళ్లీ వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ వరుస సెలవులు వచ్చాయి. జనవరి 24 శనివారం, జనవరి 25 ఆదివారం, జనవరి 26 రిపబ్లిక్ డే కారణంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అలాగే ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులకు కూడా ప్రతి వీకెండ్ లో శని, ఆది వారాలు సెలవులే ఉంటాయి.

ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బడ్జెట్ లోనే లగ్జరీ బస్సులో ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను చుట్టొచ్చే అవకాశం కల్పిస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లోని పుణ్యకేత్రాలకు టూర్ ప్లాన్ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. కేవలం రూ. 3 వేలకే ఒకరు 1 నైట్, 2 డేస్ పర్యటించేలా ప్లాన్ చేసింది. ఈ టూర్ లో భాగంగా పండరీ పూర్, గానుగాపూర్, కొల్హాపూర్, తుల్జాపూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇందుకు సంబంధించిన బస్సు బిహెచ్ఈఎల్ డిపో నుండి ప్రారంభం అవుతుంది.
తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్లాన్
ఇక ఈ టూర్ కు సబంధించిన మరిన్ని వివరాల కోసం ప్రత్యేకంగా 9391072283 లేదా 9063401072 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. మరోవైపు ఫిబ్రవరి సెకండ్ వీక్ లో రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో.. ఫిబ్రవరి 6 నుండి గోవా టూర్ ను సిద్ధం చేసింది తెలంగాణ ఆర్టీసీ. కేవలం రూ. 3,500కే 3 నైట్స్, 4 డేస్ గోవా టూర్ ప్యాకేజీని అందిస్తోంది. గోవాతో పాటు హంపీ, తుల్జాపూర్ కూడా ఈ ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..!












Click it and Unblock the Notifications