రాయలేని విధంగా, మంత్రిపై అలాంటి వ్యాఖ్యలా?: రేవంత్ రెడ్డికి షాక్, కేసు నమోదు

Posted By:
Subscribe to Oneindia Telugu

మహబూబ్ నగర్: తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదయింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఫౌండర్స్ ఫోరం నేతలు మహబూబ్ నగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

నేనొస్తే వేరేలా: పవన్ హెచ్చరిక, ఇక్కడ పుట్టిన నీకు: రోజా ఘాటుగా, రంగంలోకి బండ్ల గణేష్!

మంత్రిపై రేవంత్ వాడిని పదజాలం ప్రజలమనోభావాలను దెబ్బతీసేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్లలో జనగర్జన పేరుతో కాంగ్రెస్ నిర్వహించిన సభలో మంత్రిపై ఆయన పలు విమర్శలు చేశారు. దీనిని మంత్రి లక్ష్మారెడ్డి పత్రికా ముఖంగా ఖండిస్తూ విమర్శలు గుప్పించారు.

 పత్రికల్లో రాయలేని పదాలను రేవంత్ ఉపయోగించారు

పత్రికల్లో రాయలేని పదాలను రేవంత్ ఉపయోగించారు

దీంతో లక్ష్మారెడ్డిని ఉద్దేశించి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టిఆర్ఎస్ ఫౌండర్స్ ఫోరం నేతలు మండిపడ్డారు. పత్రికల్లో రాయలేని పదాలను కూడా వాడారని, ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

 జడ్చర్ల సభపై లక్ష్మారెడ్డి

జడ్చర్ల సభపై లక్ష్మారెడ్డి

జడ్చర్ల జనగర్జనకు కౌంటర్‌గా లక్ష్మారెడ్డి రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలన్నారు. రేవంత్‌కు అనతికాలంలోనే వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీనిపై రేవంత్ శనివారం స్పందించారు.

 చీకటి వ్యవహారాలు బయటపెడతా

చీకటి వ్యవహారాలు బయటపెడతా

మంత్రి లక్ష్మారెడ్డి తన ఆస్తులపై వ్యాఖ్యలు చేశారని, ఇద్దరి ఆస్తులపై బహిరంగ విచారణకు సిద్ధమా అని రేవంత్ శనివారం సవాల్ చేశారు. మంత్రి చీకటి వ్యవహారాన్ని వివరాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. ఒరే అంటావా అని లక్ష్మారెడ్డిపై ధ్వజమెత్తారు.

 మా ఊరికి వస్తే ఆస్తులు చూపిస్తా

మా ఊరికి వస్తే ఆస్తులు చూపిస్తా

మా ఊరికి వస్తే మేమేంటో, మా ఆస్తులు ఏమిటో తెలుస్తుందని రేవంత్ అన్నారు. తనను ఒరే అంటావా, తిట్ల పోటీ పెట్టుకుందామంటే నేను రెడీ అని వ్యాఖ్యానించారు. లక్ష్మారెడ్డి వచ్చే ఎన్నికల్లో జడ్చర్లలో ఎలా గెలుస్తారో చూస్తానని చెప్పారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తోలు తీస్తా అన్నారు. లక్ష్మారెడ్డి సర్టిఫికేట్ నకిలీదా ఒరిజినలా అని ప్రశ్నించారు. బీహెచ్ఎంఎంస్ కోర్సుకు 1985లో అనుమతి ఇచ్చారని, అలా చూస్తే 1990 బ్యాచ్ మొదటిది అవుతుందని, అయితే లక్ష్మారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో 1987లో పాసైనట్లు చూపించారన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Case filed against Congress leader and Kodangal MLA Revanth Reddy in Mahaboobnagar district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి