ఆ పథకంతో సంక్రాంతి కానుక ఇస్తున్న రేవంత్ సర్కార్!
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రేవంత్ సర్కార్ రైతాంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెప్తోంది. రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. రైతాంగానికి వివిధ పథకాలను అందజేస్తూ వారి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. తాజాగా ఈ క్రమంలోనే రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.
రైతు యాంత్రికరణ పథకాన్ని తిరిగి ప్రారంభించనున్న తెలంగాణా సర్కార్
గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన పథకాన్ని తిరిగి ప్రారంభించి రైతులకు అందించాలని నిర్ణయించింది ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 30 వేల మందికి పైగా రైతులకు లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. రైతు యాంత్రికరణ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని భావించిన రేవంత్ సర్కార్ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలను రచిస్తోంది.

సంక్రాంతికి ఆ కేంద్ర పథకం పునః ప్రారంభం
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2026 జనవరిలో ఈ పథకాన్ని పునః ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సబ్సిడీ ద్వారా ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ పథకాలను తిరిగి అమలు చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్ష 31 వేల మంది రైతులకు మేలు
ఈ పథకం పునరుద్ధరించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష 31 వేల మంది రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం అర్హులైన రైతులకు సబ్సిడీ పైన ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి అమలు చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు.
రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటన
గత ప్రభుత్వంలో నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలను తిరిగి ప్రారంభిస్తామని, ఆహార భద్రత మిషన్‌లో భాగంగా ఇప్పటికే సబ్సిడీపైన పప్పు దినుసుల విత్తనాలు అందించామని ఆయన అన్నారు. ప్రస్తుతం రైతు యాంత్రికరణ పథకాన్ని జనవరిలో ప్రారంభిస్తామని చెప్పిన మంత్రి ఈ పథకం కోసం రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని జనవరిలోగా ప్రక్రియను పూర్తిచేసి రైతులకు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
అధికారులకు మంత్రి కీలక ఆదేశం
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, యూరియా యాప్, యాంత్రీకరణ పథకం దరఖాస్తుల పైన సమాచారం సేకరించాలని అన్నారు. జనవరి తొలి వారంలో జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు మండలాలలో పర్యటించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతుల నుండి అందుతున్న పథకాల వివరాలు, సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారాలు కూడా సూచించాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఇక రైతులకు ఆదాయాన్ని పెంచే ఆయిల్ పామ్ సాగు గురించి వారికి అవగాహన కల్పించాలని, రైతులకు అందే సబ్సిడీ గురించి చెబుతూ, వారిని ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
తెలంగాణా గ్రామాలకు కేంద్రం అదిరిపోయే శుభవార్త.. రూ.247.9 కోట్ల విడుదల -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications